శుక్రవారం, 24 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By సెల్వి
Last Updated : సోమవారం, 13 ఏప్రియల్ 2020 (20:53 IST)

14 ఏళ్ల బాలికపై సామూహిక అత్యాచారం.. గర్భవతి కావడంతో..?

14ఏళ్ల బాలికపై రెండు నెలల క్రితం సామూహిక అత్యాచారానికి పాల్పడిన ఎనిమిది మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. తమిళనాడు రాష్ట్రం కోయంబత్తూర్‌లో దారుణం జరిగింది. వివరాల్లోకి వెళితే.. కోయంబత్తూరులో తొమ్మిదో తరగతి చదువుతున్న 14ఏళ్ల బాలికపై రెండు నెలల క్రితం ఎనిమిది మంది సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. 
 
ఆ తర్వాత జరిగిన విషయం ఎవరికైనా చెప్తే చంపేస్తామని బెదిరించారు. దీంతో భయపడ్డ బాధితురాలు విషయం ఎవరికీ చెప్పలేదు. అయితే గత రెండు రోజులుగా బాలిక కడుపులో నొప్పిగా ఉందని చెబుతుండటంతో తల్లిదండ్రులు ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకెళ్లారు. బాలికకు పరీక్షలు నిర్వహించిన వైద్యులు ఆమె గర్భవతి అని చెప్పడంతో బాధితురాలి తల్లిదండ్రులు షాకయ్యారు. 
 
అనంతరం బాలిక ద్వారా జరిగిన విషయం తెలుసుకుని పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు బాధ్యులైన 8 మంది నిందితులను అదుపులోకి తీసుకున్నారు.