శనివారం, 4 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎం
Last Modified: సోమవారం, 14 జూన్ 2021 (20:35 IST)

వివేకా హత్యకేసులో 8వ రోజు సిబిఐ విచారణ

కడప: మాజీ మంత్రి వైఎస్ వివేకా హత్య కేసులో ఎనిమిదో రోజు సీబీఐ విచారణ కొనసాగుతోంది.
కడప కేంద్ర కారాగారంలోని అతిథి గృహంలో సీబీఐ అధికారులు అనుమానితులను ప్రశ్నిస్తున్నారు.
 
ఇవాళ పులివెందులకు చెందిన వైసీపీ కార్యకర్త కిరణ్‌, సునీల్‌ కుమార్‌ల తండ్రి కృష్ణయ్యను విచారిస్తున్నారు. ఈ హత్యకేసులో అనుమానితులుగా ఉన్న వివేకా మాజీ కారు డ్రైవర్ దస్తగిరి, ఆయన ఇంట్లో కంప్యూటర్ ఆపరేటర్‌గా పని చేసిన ఇనాయతుల్లాతో పాటు కిరణ్‌, సునీల్‌లను సీబీఐ అధికారులు ఇప్పటికే పలుమార్లు ప్రశ్నించిన విషయం తెలిసిందే.
 
సునీల్ కుమార్ వివేకాకు అత్యంత సన్నిహితుడిగా ఉండేవాడని పులివెందులలో ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో రెండు రోజుల కిందట సీబీఐ అధికారులు పులివెందులోని అతడి ఇంటికి వెళ్లి కుటుంబ సభ్యులను ప్రశ్నించారు. దీంతో పాటు ఆదివారం వివేకా ఇంటిని కూడా మూడు గంటల పాటు అధికారులు పరిశీలించారు.