బుధవారం, 22 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఐవీఆర్
Last Modified: శనివారం, 23 డిశెంబరు 2023 (11:55 IST)

ట్రాక్టరుని ఢీకొట్టిన బస్సు: నలుగురు వ్యక్తులు మృతి

road accident
అనంతపురం జిల్లాలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో నలుగురు వ్యక్తులు అక్కడిక్కకడే మృతి చెందారు. శనివారం వేకువజామున బియ్యం లోడుతో వెళ్తున్న ట్రాక్టరుని వెనుక నుంచి ప్రైవేటు బస్సు వేగంగా వచ్చి ఢీకొట్టింది.
 
ఈ ఘటనలో ట్రాక్టరులో వున్న నలుగురు వ్యక్తులు అక్కడికక్కడే మృత్యువాత పడ్డారు. బస్సు డ్రైవరుతో మరో వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. గాయపడినవారిని సమీప ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.