మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By జె
Last Updated : శుక్రవారం, 2 నవంబరు 2018 (17:35 IST)

ప్రేమ పేరుతో ఎనిమిది మందిని అనుభవించాడు.. అది చేస్తూ అడ్డంగా దొరికిపోయాడు...

నిజమైన ప్రేమ ఎప్పటికీ చిరస్థాయిగానే ఉంటుందని అందరికీ తెలుసు. కానీ ఆ ప్రేమను అవహేళన చేస్తూ లేని ప్రేమను నటిస్తూ ఎనిమిది మంది అమ్మాయిల జీవితాలతో ఆడుకున్నాడు ఓ ప్రబుద్ధుడు. ప్రేమ పేరుతో మోసపోయామని తెలుసుకుని కొంతమంది అమ్మాయిలు అతడిని క్షమిస్తే ఒక అమ్మాయి మాత్రం అతన్ని అరెస్టు చేయించింది. 
 
నెల్లూరు జిల్లా రాపూరుకు చెందిన శిరీష్‌ డిగ్రీ పూర్తి చేసి ఉద్యోగం కోసం నగరానికి వచ్చాడు. ఒక రియల్ ఎస్టేట్ సంస్థలో ఎగ్జిక్యూటివ్‌గా చేరాడు. శిరీష్‌కు అమ్మాయిలంటే పిచ్చి. ప్రేమ పేరుతో వారిని వలేసి అనుభవించాలన్నది అతని ఉద్దేశం. తనతో పాటు పనిచేసే అమ్మాయిలతో పాటు వారి ద్వారా పరిచయమైన అమ్మాయిలను ప్రేమ పేరుతో వలేశాడు. 
 
8 మంది అమ్మాయిలను అనుభవించాడు. ఆ తరువాత రాజేశ్వరి అనే అమ్మాయితో పరిచయం పెంచుకున్నాడు. ప్రేమిస్తున్నట్లు ఆమెను వెంట తిప్పుకున్నాడు. రాజేశ్వరి తల్లిదండ్రులు ఆర్థికంగా బాగా ఉన్నవారు. దీంతో అప్పుడప్పుడు ఖర్చుల కోసం ఆమె దగ్గర డబ్బులు తీసుకోవడం మొదలెట్టాడు. అంతేకాదు రాజేశ్వరి అన్న శ్రీనివాస్‌కు మాయమాటలు చెప్పి బాగా దగ్గరయ్యాడు శిరీష్‌. అతని వద్ద రెండు లక్షల దాకా వసూలు చేశాడు. 
 
శిరీష్‌ పుట్టినరోజుకు గిఫ్ట్ ఇవ్వాలని తన ప్యాకెట్ మనీలోని 30 వేల రూపాయలను ఖర్చు పెట్టి బంగారు గొలుసు తీసుకొని బహుమతిగా ఇచ్చింది. బహుమతి ఇచ్చేందుకు ఇంటికి వెళ్ళిన రాజేశ్వరిని లొంగదీసుకున్నాడు శిరీష్‌. పెళ్ళి చేసుకుంటానని చెప్పడంతో రాజేశ్వరి నమ్మింది. ఇలా నెలరోజుల పాటు ఆమెను నమ్మబలికాడు. శిరీష్‌‌తో కలిసి నెల్లూరు నగరంలో తిరుగుతుండగా అతను మోసం చేసిన అమ్మాయి రాజేశ్వరిని చూసింది. 
 
విషయాన్ని రాజేశ్వరికి ఫోన్ ద్వారా తెలిసింది. అయితే మొదట్లో నమ్మని రాజేశ్వరి ఆ తరువాత నిజం తెలుసుకుంది. తనలాగా ఎవరూ మోసపోకూడదని శిరీష్‌‌ను తన గదికి పిలిచింది. అతనితో సన్నిహితంగా ఉంటున్నట్లు నటించి పోలీసులకు సమాచారమిచ్చింది. పోలీసులు నిందితున్ని అదుపులో తీసుకున్నారు. అంతకుముందే శిరీష్‌ చేతిలో మోసపోయిన అమ్మాయిలందరూ నెల్లూరు పోలీసులకు ఫిర్యాదు చేశారు.