శుక్రవారం, 24 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By సెల్వి
Last Updated : శనివారం, 11 సెప్టెంబరు 2021 (18:30 IST)

తిరుమల ఘాట్ రోడ్డులో ఘోర ప్రమాదం: వ్యక్తి మృతి

తిరుమల ఘాట్ రోడ్డులో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. తిరుమల మొదటి కనుమదారిలో.. జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి మృతి చెందాడు. తిరుమల శ్రీవారిని దర్శించుకునే వస్తుండగా కారు ప్రమాదానికి గురైంది. తిరుపతి చేరుకునేందుకు మరో మూడు కిలోమీటర్ల దూరంలో ఉండగా.. జరిగిన ఈ దుర్ఘటన లో శివలింగం అనే వ్యక్తి దుర్మరణం చెందాడు.
 
ఇంకా ఈ ప్రమాదంలో మరో ఇద్దరు వ్యక్తులు తీవ్రంగా గాయపడ్డారు. అలాగే మరో వ్యక్తి పరిస్థితి చాలా విషమంగా …. ఉందని సమాచారం అందుతోంది. కారు అదుపు తప్పి రైలింగ్ న్యూడ్ ఢీకొట్టడంతోనే ఈ ఘటన జరిగినట్లు సమాచారం అందుతోంది. 
 
అంతేకాదు డ్రైవర్ నిర్లక్ష్యం కూడా ఉన్నట్లు సమాచారం. ఇక ఈ ఘటనలో గాయపడ్డ వ్యక్తులను వైద్యం కోసం తిరుపతిలోని రుయా ఆస్పత్రికి తరలించారు స్థానికులు. ప్రమాదానికి గురైన వారు తెలంగాణ రాష్ట్రంలోని మెదక్ జిల్లాకు చెందిన వారుగా పోలీసులు గుర్తించారు.