బుధవారం, 25 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎం
Last Updated : బుధవారం, 11 డిశెంబరు 2019 (14:17 IST)

చంద్రబాబు ఇంటిని ముంచే దానిపైనే ఫోకస్.. అచ్చెన్నాయుడు

కృష్ణా నదికి వరదలు వచ్చినప్పుడు సీమ ప్రాజెక్టులకు నీటిని మళ్లించే అంశాన్ని పక్కన పెట్టింది ప్రభుత్వం. చంద్రబాబు ఇంటిని ఏ విధంగా ముంచాలనే అంశం మీదే మంత్రి అనిల్ ఫోకస్ పెట్టారని టీడీపీ ఎమ్మెల్యే అచ్చెన్నాయుడు అన్నారు.
కృష్ణా మిగులు జలాలపై హక్కులు వదులుకుంటూ లేఖ రాసిన వైఎస్సారును కీర్తిస్తున్నారని దుయ్యబట్టారు. 
 
మంత్రి బుగ్గన మాట్లాడుతూ.. అప్పటి పరిస్థితులు.. నిబంధనల ప్రకారం వైఎస్ లేఖ రాశారు. ప్రాజెక్టుల నిర్మాణానికి ఇబ్బంది రాకుండా ఉండేందుకే వైఎస్ ఆనాడు లేఖ రాశారు. ఈ విషయాన్ని ప్రతిసారీ లేవనెత్తుతూ వాస్తవాలను వక్రీకరిస్తున్నారన్నారు. 
 
రాయలసీమ ప్రాజెక్టుల గురించి ఏ మాత్రం తెలియని వాళ్లు ప్రశ్నలు వేయడం అవమానంగా ఉంది. గండికోట ప్రాజెక్టు కోసం టీడీపీ హయాంలో  భూ సమీకరణ చేశారా..? నిర్వాసితులకు పరిహరం అందించారా..? బ్రహ్మం సాగర్ చెరువుకు గత ఐదేళ్లల్లో రూపాయైనా ఖర్చు పెట్టారా..? దీనికి చంద్రబాబు సమాధానం చెప్పాలని వైసీపీ ఎమ్మెల్యే రఘురామ్ రెడ్డి తెలిపారు. 
 
టీడీపీని చూస్తే పాపం అనిపిస్తోంది. కర్నూలు, కడప జిల్లాల్లో ఒక్క ఎమ్మెల్యే అయినా ఉన్నారా..? చిత్తూరులో చంద్రబాబు.. అనంతలో బాలయ్య, కేశవ్ తప్ప వేరే వారు ఉన్నారా..? రాయలసీమ ప్రాజెక్టుల కోసం కృషి చేసి ఉంటే తెలుగుదేశం పరిస్థితి ఇలా ఎందుకు ఉంటుంది..?  అని వైసీపీ ఎమ్మెల్యే రఘురామ్ రెడ్డి ప్రశ్నించారు.


అమరావతి
 
 రాయలసీమ ప్రాజెక్టులపై అసెంబ్లీలో చర్చ
 
గండికోట రిజర్వాయర్ కోసం మరో వేయి కోట్లు ఖర్చు పెడితే 15 టీఎంసీల నీటిని నిల్వ చేసుకునే అవకాశం ఉండేది.
 
పెద్ద ఎత్తున వరద వచ్చినా రాయలసీమ ప్రాజెక్టుల్లో నీటిని నిల్వ చేసుకోలేకపోయారు. 
 
రాయలసీమ నుంచి ఎన్నికైన కేశవ్ సభలో లేకున్నా.. బాలకృష్ణ మాట్లాడతారని భావించాం.. కానీ మాట్లాడ లేదు.
 
గండికోట స్టోరేజ్ కెపాసిటీని 26 టీఎంసీలకు పెంచింది వైఎస్ కుదించే ప్రయత్నం చేసింది చంద్రబాబు.
 
కడప ప్రజల గుండె లబ్ డబ్ అని కాదు.. గండికోట.. అని కొట్టుకుంటుందని చెప్పిన మహా నేత వైఎస్. 
 
రాయలసీమలోని ఏ ప్రాజెక్టును టచ్ చేసిన వైఎస్ గురించే చెబుతుంది - శ్రీకాంత్ రెడ్డి, ప్రభుత్వ చీఫ్ విప్.