గురువారం, 9 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By జె
Last Updated : గురువారం, 7 మార్చి 2019 (22:34 IST)

యువకుడితో భార్య సన్నిహితంగా... అర్థరాత్రి కత్తెరతో భర్త...

అక్రమ సంబంధాల కారణంగా ఎన్నో జీవితాలు నాశనమైపోతున్నాయి. ఎంతోమంది చనిపోతున్నారు కూడా. తాజాగా పశ్చిమ గోదావరిజిల్లా గణపవరం మండలం జగన్నాథపురంలో జరిగిన సంఘటన రెండు తెలుగు రాష్ట్రాల్లోను తీవ్ర చర్చనీయాంశంగా మారుతోంది.
 
క్రిష్ణమనాయుడు, సావిత్రమ్మకు 20 సంవత్సరాల క్రితం వివాహమైంది. వీరికి ఒక కూతురు ఉంది. సంవత్సరం క్రితమే వివాహం చేసి పంపించేశారు. ఇంట్లో ఇద్దరు మాత్రమే ఉండేవారు. క్రిష్ణమనాయుడు స్థానిక రైతు. సావిత్రమ్మ తన ఇంటికి సమీపంలోని ఒక యువకుడితో పరిచయం ఏర్పరచుకుంది. ఆ పరిచయం కాస్తా వివాహేతర సంబంధానికి దారితీసింది. గత రెండు నెలలుగా ఈ తతంగం సాగుతోంది. అయితే భర్తకు తెలిసి మందలించాడు.
 
అయినా ఆమెలో మార్పు రాలేదు. దీంతో నిన్న రాత్రి ఇంట్లో నిద్రిస్తుండగా ఇంట్లోని కత్తెరతో ఆమె పొట్టలో నాలుగుసార్లు పొడిచాడు. దీంతో తీవ్ర రక్తస్రావమై సావిత్రమ్మ మరణించింది. క్రిష్ణమనాయుడును పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.