గురువారం, 23 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By జె
Last Modified: శుక్రవారం, 26 జూన్ 2020 (17:13 IST)

మద్యం ప్రియులకు షాక్, మద్యం అమ్మకాలు తగ్గాయి, ప్రభుత్వం ఏం చేయబోతోందంటే?

ఎపిలో మద్యం అమ్మకాలు దశలవారీగా తగ్గుతున్నాయి. గత సంవత్సరం ఈ యేడాది లెక్కలను పరిశీలిస్తే సర్కార్ ఒక్కసారిగా 75 శాతం పెంచిన ధరలతో మందుబాబులకు కరెంట్ షాక్ కొట్టింది. ఎపిలో ఏరులై పారుతున్న మద్యాన్ని దశలవారీగా నిషేధిస్తానని మాటిచ్చారు జగన్. ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి మద్యం అమ్మకాలపై అనేక ఆంక్షలు విధిస్తూ వచ్చారు. ప్రభుత్వం చేపట్టిన చర్యలు... క్షేత్రస్థాయిలో అమ్మకాలపై తీవ్ర ప్రభావం చూపిస్తోంది.
 
గత యేడాది మే నుంచి ఈ యేడాది వరకు గణాంకాలను పరిశీలిస్తే ఆ తేడా స్పష్టంగా పరిశీలిస్తోంది. బీర్లను దాదాపుగా తగ్గించిన పరిస్థితి ఎపిలో కనబడుతోంది. ఇంకా తగ్గే అవకాశాలు ఉన్నాయట. గత యేడాది మే నెలలో 34.47లక్షల కేసుల బీర్లు అమ్మకాలు జరుగగా ఖజానాకు 41 కోట్ల ఆదాయం వచ్చింది.
 
ఇక 2020 మే నెల లెక్కలను పరిశీలిస్తే మద్యం అమ్మకాలు 28 లక్షల నుంచి 11.68 లక్షల కేసులకు తగ్గింది. అయితే 75 శాతం ఆదాయం పెంచడం వల్ల ఖజానాకు 133 కోట్ల ఆదాయం వచ్చింది. అమ్మకాల్లో భారీ వ్యత్యాసం వచ్చినప్పటికీ ధరల పెంపుతో ఆదాయంలో కేవలం 8 కోట్ల తేడా మాత్రమే వచ్చింది.  
 
రాష్ట్రవ్యాప్తంగా వైన్ షాపులను తగ్గిస్తూ ఇప్పటికే జగన్ ప్రభుత్వం రెండుసార్లు ఆదేశాలు ఇచ్చింది. గత ప్రభుత్వ హయాంలో 4,300 షాపులు ఉండగా 20 శాతం తగ్గింపుతో అది కాస్త 3,500కు చేరుకున్నాయి. వాటిలో కూడా 15 శాతం తగ్గించడంతో 2,986 మిగిలాయి. వీటిని కూడా తగ్గించేందుకు ప్రభుత్వ కసరత్తులు చేస్తోంది. మరోవైపు బార్లను కూడా తగ్గించేందుకు ప్రభుత్వం ప్రయత్నాలు చేసింది.
 
అయితే ఈ అంశం కాస్త కోర్టులో ఉండటంతో నిలిచిపోయింది. ప్రస్తుతం బార్ల సమయం ముగియడంతో ఏ నిబంధనలు పాటిస్తారో ఎలా వాటిని తగ్గిస్తారోనన్నది ఆసక్తికరంగా మారుతోంది. ఇలా తగ్గిస్తూ పోతే సంపూర్ణ మద్యపాన నిషేధం ఖాయమంటున్నారు ఎక్సైజ్ ప్రొహిబిషన్ శాఖ అధికారులు.