శుక్రవారం, 24 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎం
Last Updated : శుక్రవారం, 14 ఆగస్టు 2020 (19:36 IST)

ఆగస్టు 15 వేడుకలకు అన్ని ఏర్పాట్లు సిద్ధం: డీజీపీ గౌతం స‌వాంగ్‌

స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలకు విజయవాడ ఇందిరాగాంధీ మున్సిపల్‌ స్టేడియం అన్ని రకాలుగా సంసిద్ధంగా ఉన్నట్లు డీజీపీ గౌతం సవాంగ్‌ తెలిపారు.

ఈ సందర్భంగా డీజీపీ మున్సిపల్‌ స్టేడియంలో వేడుకల ఏర్పాట్లను శుక్రవారం పరిశీలించారు. గౌతమ్‌ సవాంగ్‌ మాట్లాడుతూ.. స్వాతంత్య్ర వేడుకలకు ఇందిరాగాంధీ మున్సిపల్‌ స్టేడియం సిద్ధంగా ఉందన్నారు.కోవిడ్ నేపథ్యంలో నిబంధనలు పాటించి జాగ్రత్తలు తీసుకోవాలని ఆదేశించారు.

రేపు ఉదయం ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహ‌న్ ‌రెడ్డి వేడుకల్లో పాల్గొని గౌరవ జెండావందనం చేయనున్నారు. పెరేడ్‌కు సంబంధించిన ఫైనల్‌ రిహార్సల్స్‌ని వీక్షించిన డీజీపీ గౌతం స‌వాంగ్ వారికి పలు సూచనలు చేశారు.

శ‌నివారం పెరేడ్‌లో ఆరు బెటాలియన్లకు చెందిన ఆరు కంటింజెంట్లు పాల్గొంటుండగా.. వివిధ శాఖలకు చెందిన పది శకటాలు ప్రదర్శన ఇవ్వనున్నాయి. కార్య‌క్ర‌మంలో సీఎస్‌ నీలం సహానీ, ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ప్రవీణ్‌ ప్రకాష్‌‌, సీఎం పోగ్రాం కో-ఆర్డినేటర్‌ తలశిల రఘురాం తదితరులు ఉన్నారు.