ఆదివారం, 12 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By సెల్వి
Last Updated : శనివారం, 30 మే 2020 (13:49 IST)

గ్రామ వలంటీరు వేధింపులు.. మాజీ మంత్రి కారు డ్రైవర్ సూసైడ్

విశాఖపట్టణం జిల్లాల్లో ఓ విషాదకర సంఘటన జరిగింది. మాజీ మంత్రి బండారు సత్యనారాయణ మూర్తి కారు డ్రైవర్ బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఓ గ్రామ వలంటీరు వేధింపులు వల్లే ఆత్మహత్య చేసుకున్నట్టు మృతుడు సూసైడ్‌కు మందు తమ బంధువులకు పంపిన ఆడియో టేపులో పేర్కొన్నట్టు సమాచారం. 
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, విశాఖ జిల్లా నునపర్తిలో ఈ ఘటన జరిగింది. మృతుడిని సన్యాసి నాయుడిగా గుర్తించి, ఈయన మాజీ మంత్రి బండారు సత్యనారాయణ మూర్తి వద్ద డ్రైవర్‌గా పని చేస్తున్నట్టు పోలీసులు వెల్లడించారు. 
 
అయితే, గ్రామ వలంటీరు నరసింహా రావు, అతని సోదరుడు దొరబాబు, గంగా భవానీలు కలిసి తనను వేధించారనీ, అందువల్లే తాను ఆత్మహత్య చేసుకున్నట్టు అతను బంధువులకు పంపిన ఆడియోలో పేర్కొన్నాడు. దీనిపై స్థానిక పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు.