ఆదివారం, 2 ఫిబ్రవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By సెల్వి
Last Updated : శనివారం, 11 మే 2024 (14:13 IST)

వైసీపీ అభ్యర్థి కోసం నంద్యాలలో పుష్ప.. స్నేహితుడికి ఓటు వేయాలని..

Allu Arjun
Allu Arjun
వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి శిల్పా రవిచంద్రా రెడ్డి కోసం అల్లు అర్జున్ నంద్యాలకు చేరుకున్నారు. ఇంకా తన బాబాయ్, జనసేన అధినేత పవన్ కల్యాణ్ కోసం రామ్ చరణ్ పిఠాపురం వెళ్లారు. అక్కడ పవన్ కోసం ప్రచారం చేపట్టారు. ఇక బన్నీ కూడా బరిలోకి దిగి రవిచంద్రారెడ్డికి ఓటు వేయాలని కోరారు.  
 
అల్లు అర్జున్‌తో పాటు ఆయన భార్య స్నేహారెడ్డి కూడా నంద్యాలకు వెళ్లారు. స్నేహారెడ్డి, రవిచంద్రారెడ్డి భార్య నాగినీరెడ్డి ఇద్దరూ క్లాస్ మేట్స్ కూడా. 
 
మరోవైపు బన్నీని చూసేందుకు అభిమానులు పోటెత్తారు. 2019 ఎన్నికల్లో రవిచంద్రారెడ్డి నంద్యాల నుంచి పోటీ చేసినప్పుడు కూడా ఆయనకు అల్లు అర్జున్ మద్దతు తెలిపారు.