సోమవారం, 27 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎం
Last Updated : గురువారం, 21 జనవరి 2021 (09:47 IST)

మార్చి 2 నుండి ఏకాంతంగా శ్రీ‌నివాస‌మంగాపురం శ్రీ క‌ల్యాణ వేంక‌టేశ్వ‌ర‌స్వామివారి బ్ర‌హ్మోత్స‌వాలు

శ్రీ‌నివాస‌మంగాపురంలోని శ్రీ క‌ల్యాణ వేంక‌టేశ్వర‌‌స్వామివారి ఆల‌యంలో మార్చి 2 నుండి 10వ తేదీ వ‌ర‌కు జ‌రుగ‌నున్న వార్షిక బ్ర‌హ్మోత్స‌వాల‌ను కోవిడ్ -19 నేప‌థ్యంలో ఏకాంతంగా నిర్వ‌హించ‌నున్న‌ట్లు టిటిడి జెఈవో  పి.బ‌సంత్‌కుమార్ తెలిపారు. 

ఈ సంద‌ర్భంగా జెఈవో మాట్లాడుతూ దేశంలో, రాష్ట్రంలో కోవిడ్ వ్యాక్సినేష‌న్ జ‌‌రుగుతున్నందున ఈ ఏడాది స్వామివారి బ్ర‌హ్మోత్స‌వాలు ఆల‌యంలో ఏకాంతంగా నిర్వ‌హించ‌నున్న‌ట్లు తెలిపారు.

బ్ర‌హ్మోత్స‌వాలలో భాగంగా మార్చి 1న అంకురార్ప‌ణ‌, మార్చి 2న ధ్వ‌జారోహ‌ణం, మార్చి 6న గ‌రుడ‌వాహ‌నం, మార్చి 7న వ‌సంతోత్స‌వం, మార్చి 10వ తేదీ చ‌క్ర‌స్నానంతో బ్ర‌హ్మోత్స‌వాలు ముగుస్తాయ‌న్నారు. వాహ‌న సేవ‌ల‌ను ఎస్వీబీసీలో ప్ర‌త్య‌క్ష ప్ర‌సారం చేయ‌నున్న‌ట్లు తెలిపారు. 
 
బ్ర‌హ్మోత్స‌వాల సంద‌ర్భంగా ఆల‌యంలో ప్ర‌తి రోజు సాయంత్రం నిర్వ‌హించే ఊంజ‌ల సేవలో ప్ర‌ముఖ క‌ళాకారుల‌తో అన్న‌మ‌య్య సంకీర్త‌న‌లు ఏర్పాటు చేయాల‌ని అన్న‌మాచార్య ప్రాజెక్టు డైరెక్ట‌ర్‌కు సూచించారు.

శ్రీ క‌ల్యాణ వేంక‌టేశ్వ‌ర‌స్వామివారి బ్ర‌హ్మోత్స‌వాల‌ను ఏకాంతంగా నిర్వ‌హించ‌నున్న‌ట్లు ఎస్వీ‌బీసీలో ప్రోమో ప్ర‌సారం చేయాల‌న్నారు. ఆల‌యంలో గార్డెన్ విభాగం ఆధ్య‌ర్యంలో సుంద‌రంగా పుష్ప‌లంక‌ర‌ణ‌లు చేప‌ట్టాల‌న్నారు. పారిశుధ్యా‌నికి అవ‌స‌ర‌మైన అద‌న‌పు సిబ్బందిని, మొబైల్ టాయిలెట్లు ఏర్పాటు చేయాల‌ని ఆరోగ్య విభాగం అధికారులను ఆదేశించారు. 
 
ఈ స‌మీక్ష స‌మావేశంలో సిఇ ర‌మేష్ రెడ్డి, ఎస్ఇ -1 జ‌గ‌దీశ్వ‌ర్ రెడ్డి, డెప్యూటీ ఈవో శాంతి, ఎస్ఇ వెంక‌టేశ్వ‌ర్లు, అద‌న‌పు ఆరోగ్య శాఖాధికారి డాక్ట‌ర్ సునీల్ కుమార్, ఎస్టేట్ అధికారి మ‌ల్లిఖార్జున‌, ర‌వాణావిభాగాధిప‌తి శేషారెడ్డి, విజివో  మ‌నోహ‌ర్‌, ఏఈవో ధ‌నంజ‌యులు పాల్గొన్నారు.