Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

కొత్తగా పెళ్లైంది.. భర్తతో విభేదాలు.. వేరొకరితో సహజీవనం.. అనుమానస్పద మృతి.. ఎలా?

మంగళవారం, 31 జనవరి 2017 (11:13 IST)

Widgets Magazine
marriage

కొత్తగా పెళ్లైంది. రెండు నెలలు కూడా గడవలేదు. భర్తతో కలిసి 15 రోజులే కాపురం చేసింది. అయితే భర్త వేధింపులు తాళలేక.. ఇంటి నుంచి వెళ్ళిపోయింది. వేరొకరితో సహజీవనం చేసింది. కానీ అనుమానస్పద స్థితిలో మృతి చెందింది. మృతురాలి మెడపై ఉరితీసిన గుర్తులుండడంతో ఆమెది హత్యా.. ఆత్మహత్యా.. అనే కోణంలో దర్యాప్తు జరుపుతున్నట్లు తెలిపారు. 
 
వివరాల్లోకి వెళితే.. రాష్ట్ర రాజధాని అమరావతికి సమీపంలో ధర్మకోట గ్రామానికి చెందిన మల్లాడి రాంబాబు, నాగలక్ష్మి దంపతుల కుమార్తె కృష్ణవేణి(20)ని ఫ్రెంచి యానాంకు చెందిన సంగాని సత్యనారాయణకు 2016 డిసెంబరు 1న వివాహం చేశారు. వీరిద్దరూ 15 రోజుల పాటే కాపురం చేశారు. వీరిద్దరి మధ్య ఏర్పడిన విభేదాలు వేధింపులకు దారితీసింది. భర్త వేధింపులు తాళలేక కృష్ణవేణి అమలాపురానికి చేరుకుంది. 
 
స్థానికంగా తాపీ పనిచేస్తున్న చుట్టుగుళ్ల నానితో కృష్ణవేణికి పరిచయం ఏర్పడింది. వీరిద్దరూ కామనగరువు శివారు అబ్బి రెడ్డివారికాలనీలో భార్యాభర్తలమని చెప్పి ఓ ఇంట్లో అద్దెకు దిగారు. తాపీపని చేసుకునే నాని రెండ్రోజులకొకసారి వస్తానని ఇంటివారిని నమ్మించి కృష్ణవేణిని చూసుకోమని చెప్తుండేవాడు. కృష్ణవేణి స్థానిక ముస్లింవీధిలోని గణేష్‌ కిరాణామర్చంట్స్‌లో పనిచేసేది. 
 
ఈ నేపథ్యంలో ఈనెల 29 ఉదయం ఇంట్లో కృష్ణవేణి స్పృహలేకుండా పడి ఉండడాన్ని ఇంటి యజమాని గుర్తించారు. కృష్ణవేణిని పరిశీలించిన వైద్యులు ఆమె మెడపై ఉరి వేసినట్టు గుర్తులు ఉన్నట్టు నిర్ధారించారు. ఆమె ఆత్మహత్యకు పాల్పడిందా.. లేక హత్యచేశారా.. అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు వార్తలు

news

నేటి నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు... సభకు వచ్చిన ప్రణబ్ ముఖర్జీ

పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు మంగళవారం నుంచి ప్రారంభమయ్యాయి. దీంతో ఉభయ సభలనుద్దేశించి ...

news

నాలుగేళ్ళ చిన్నారిపై లైంగిక దాడి.. కామాంధుడికి ఐదేళ్ళ కఠిన శిక్ష: పోక్సో కోర్టు తీర్పు

బెంగుళూరులో నాలుగేళ్ళ చిన్నారిపై లైంగికదాడికి పాల్పడిన కామాంధుడికి పోక్సో ప్రత్యేక కోర్టు ...

news

ఆర్కే.నగర్ ఉప ఎన్నికల బరిలో జయలలిత మేనకోడలు.. శశికళకు షాక్

ముఖ్యమంత్రి దివంగత జయలలిత మరణం తర్వాత ఖాళీ ఏర్పడిన చెన్నై జిల్లాలోని ఆర్కే నగర్ అసెంబ్లీ ...

news

డ్రగ్ కేసులో ‘నువ్వొస్తానంటే నేనొద్దంటానా’ నటుడు అభిషేక్‌ అరెస్టు.. విదేశీయులు కూడా...

డ్రగ్ కేసులో ‘నువ్వొస్తానంటే నేనొద్దంటానా’, 'డేంజర్' వంటి చిత్రాల్లో నటించిన నటుడు ...

Widgets Magazine