శుక్రవారం, 27 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By సెల్వి
Last Updated : శనివారం, 4 జూన్ 2022 (12:27 IST)

అమరావతి రాజధాని ఉద్యమానికి నేటితో 900 రోజులు

amaravathi
అమరావతి రాజధాని ఉద్యమానికి నేటితో 900 రోజులు అయ్యాయి. ఉద్యమం 900 రోజులకు చేరిన సందర్భంగా అమరావతి రైతులు న్యాయదేవతకు పాలాభిషేకం చేశారు. రాజధాని ఉద్యమ వీరులకు నివాళులు అర్పించనున్నారు. 
 
శనివారం విజయవాడలో 'హైకోర్టు తీర్పు-సర్కారు తీరు' పేరిట సదస్సు నిర్వహించనున్నారు. అమరావతిని రాజధానిగా సాధించేంతవరకు పోరాటం ఆపబోమని రైతులు స్పష్టం చేస్తున్నారు. 
 
కాగా, టీడీపీ అధికారంలో వుండగా అమరావతి కోసం భూములిచ్చిన రైతులు ఒక్కసారిగా రోడ్డున పడ్డారు. వైకాపా అధికారంలోకి వచ్చాక మూడు రాజధానుల నిర్ణయం తీసుకోవడంతో రాజధానికి భూములు ఇచ్చిన అమరావతి రైతులు హతాశులయ్యారు. అయితే, రాజధాని కోసం వారు వీరు అన్న తేడా లేకుండా, రైతులు, మహిళలు, పిన్నలు, పెద్దలు దీక్ష ప్రారంభించారు. 
 
2019 డిసెంబరు 17న మొదలైన ఆ దీక్ష నేటితో 900 రోజులకు చేరింది. ఈ రాజధాని ఉద్యమం వివిధ రూపాల్లో సాగింది. ప్రభుత్వ నిర్ణయాలు తమకు వ్యతిరేకంగా ఉన్నా, కోర్టు తీర్పులు వారికి ఎనలేని ఊరటనిచ్చాయి.