గురువారం, 19 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : సోమవారం, 3 జనవరి 2022 (17:45 IST)

నగర పాలక సంస్థగా అమరావతి : ఏపీ సర్కారు నిర్ణయం

నవ్యాంధ్ర రాజధాని ప్రాంతంగా ఉన్న అమరావతిని నగర పాలక సంస్థ (కార్పోరేషన్)గా మారనుంది. ఈ మేరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. 
 
అమరావతి క్యాపిటల్ సిటీ కార్పొరేషన్‌‍గా పేరు పెట్టే ఈ ప్రాంత పరిధిలోకి 19 గ్రామాలను చేర్చారు. ఈ మేరకు గుంటూరు జిల్లా కలెక్టరేట్ నుంచి నోటిఫికేషన్‌ను జారీ అయింది. 
 
తుళ్లూరు మండలోని 16 గ్రామాలు, మంగళగిరి మండలంలోని 3 గ్రామాలతో ఈ అమరావతి కార్పొరేషన్ ఏర్పాటు చేయనున్నారు. ఈ మేరకు 19 గ్రామాల్లో ప్రజలతో గ్రామ సభలు, సమావేశాలు నిర్వహించి ప్రజల అభిప్రాయాలు సేకరించాలని జిల్లా కలెక్టర్ అధికారులను ఆదేశించారు. 
 
కాగా, ఇటీవల అమరావతిలో నిర్మాణం పూర్తయిన ఐఏఎస్, ఐపీఎస్, మంత్రులు, ఎమ్మెల్యేల క్వార్టర్స్‌లో మిగిలిపోయిన నిర్మాణ పనులను కూడా ప్రభుత్వం ప్రారంభించిన విషయం తెల్సిందే. అలా ఒక్కో పనికి ఏపీ సర్కారు శ్రీకారం చుట్టింది.