గురువారం, 12 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఐవీఆర్
Last Modified: శుక్రవారం, 6 డిశెంబరు 2024 (20:39 IST)

ఒరేయ్ ఆంబోతూ, మా పార్టీని మింగపెట్టడానికా: సీమరాజు కామెంట్లపై అంబటి రాంబాబు ఫిర్యాదు

Ambati Rambabu
సోషల్ మీడియాలో తనపై అసభ్యకరమైన వ్యాఖ్యలు చేస్తూ కామెడీ చేస్తున్న సీమరాజుపై పోలీసు కేసు పెట్టినట్లు మాజీమంత్రి అంబటి రాంబాబు వెల్లడించారు. ఆయన మీడియా ముందు మాట్లాడుతూ... '' సీమరాజు అంట, మా మనిషిగానే వుంటాడు, మమ్మల్ని అసభ్యకరంగా మాట్లాడుతుంటాడు, ఒరేయ్ ఆంబోతూ... మా పార్టీని మింగపెట్టడానికా... సీమరాజు సంచలమైన ప్రెస్ మీట్, ఇక రెండోది.. సుకన్య-సంజనలను వదిలేసి మా వెంటబడ్డాడు అంబటి రాంబాబు, ఐ లవ్ యు రాజా... కామెడిగా వుంది కదా" అంటూ సీమరాజు తాలూకు వ్యాఖ్యల ప్రింట్లవుట్లను చూపించారు.
 
పరువు నష్టం దావా వేస్తా: విజయసాయి రెడ్డి
వైసిపి రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి హెచ్చరించారు. తనపై ఆరోపణలు చేసిన కేవీ రావుపై పరువు నష్టం దావా వేస్తానంటూ బహిరంగ హెచ్చరికలు చేశారు. కాకినాడ పోర్టులోని తన వాటాను బెదిరించి లాక్కొన్నారని, ఈ వ్యవహారంలో వైవీ సుబ్బారెడ్డి కుమారుడు విక్రాంత్ రెడ్డి, లిక్కర్ స్కామ్‍‌లో జైలులో ఉండి ఆ తర్వాత అప్రూవర్‌గా మారి బెయిలుపై జైలు నుంచి విడుదలైన శరత్‌శ్చంద్రారెడ్డి, వైకాపా ఎంపీ విజయసాయి రెడ్డిల తదితరులపై కేవీ రావు సంచలన ఆరోపణలు చేయడంతో పాటు పోలీసులకు ఫిర్యాదు కూడా చేశారు. ఆ తర్వాత వీరంతా కలిసి కేవీరావుపై బెదిరింపులకు దిగారని టీడీపీ నేత ఆనం వెంకటరమణారెడ్డి ఆరోపించారు. 
 
కేవీరావు గొంతుమీద కత్తిపెట్టి రూ.2 వేల కోట్ల విలువైన కాకినాడ సెజ్ భూములను రూ.12 కోట్లకు, కాకినాడ సీ పోర్టులో రూ.2,689 కోట్ల విలువైన షేర్లను రూ.494 కోట్లకే కొట్టేశారని వివరించారు. దీనిపై విజయసాయిరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు.
 
'కేవీ రావును విక్రాంత్ రెడ్డి బెదిరించాడట. విక్రాంత్ రెడ్డిది చిన్న వయసు... కేవీ రావు భారీ మనిషి! విక్రాంత్ రెడ్డి లాంటి వాడు కేవీ రావును బెదిరించడమేంటి... నాకర్థం కావడంలేదు. మరి విక్రాంత్ రెడ్డి భయపెడితే కేవీ రావు భయపడ్డాడా? ఆ కేవీ రావు సంవత్సరంలో ఆరేడు నెలలు అమెరికాలోనే ఉంటాడు. సింగపూర్‌లో ప్రధాన కార్యాలయం ఏర్పాటు చేసుకుని ప్రపంచవ్యాప్తంగా బ్రోకర్ పనులు చేస్తుంటాడు. ఇలాంటి వ్యక్తిని విక్రాంత్ రెడ్డి భయపెట్టాడంటే నమ్మొచ్చా?
 
పైగా, రెండు చార్టర్డ్ అకౌంటెంట్ సంస్థలు నాకు నామినీలు అని ఆరోపిస్తున్నారు. నేను 2020 మేలో ఈ బ్రోకర్ కేవీ రావుకు ఫోన్ చేసి... విక్రాంత్ రెడ్డి వస్తాడు... కాకినాడ సీ పోర్ట్ గురించి మాట్లాడతాడు అని చెప్పానంట. చంద్రబాబుకు బుద్ధి మందగించిందా? అని ప్రశ్నిస్తున్నా. ఎందుకంటే, చార్టర్డ్ అకౌంటెంట్ సంస్థలకు నామినీలు ఉండరు. నామినీలు ఉండేది బ్యాంకు అకౌంట్లకేనన్న ఇంగిత జ్ఞానం చంద్రబాబుకు లేకపోతే ఇంకెలా అర్థం చేసుకోవాలి?
 
వాస్తవాలు ఏంటంటే... కాకినాడ పోర్టును నాడు ఏషియన్ డెవలప్ మెంట్ బ్యాంకు (ఏడీబీ) నిధులతో ఏర్పాటు చేశారు. ప్రభుత్వ రంగంలో ఉండాల్సిన పోర్టును చంద్రబాబు ప్రైవేటు రంగానికి అప్పగించేశారు. అప్పటి మలేసియా ప్రధాని కుమారుడు ఈ పోర్టును కొంటున్నారని ప్రచారం చేశారు. కానీ ఆ ముసుగులో కాకినాడ సీ పోర్టును కేవీ రావుకు అప్పగించారు. కేవీ రావును సీఎండీగా చేశారు.
 
కాకినాడ సీ పోర్టు వ్యవహారంలో ఏం జరిగిందో తెలియాలంటే 1997 నుంచి జరిగిన పరిణామాలపై సీబీఐతో దర్యాప్తు చేయించాలి. చంద్రబాబు అందరినీ క్రిమినల్స్ అంటుంటాడు... చంద్రబాబే ఒక క్రిమినల్. అలాంటి చంద్రబాబుకు ఈ బ్రోకర్ కేవీ రావు ఒక చెంచా. కేవీ రావుకు నిజంగానే అన్యాయం జరిగి ఉంటే అప్పుడే కోర్టుకు ఎందుకు వెళ్లలేదు?
 
ఇప్పుడు నా పేరు ప్రస్తావిస్తూ తప్పుడు ఆరోపణలు చేస్తున్నారు... నా మీద లుకౌట్ నోటీసులు జారీ చేయాల్సినంత అవసరం ఏమొచ్చింది? నా ప్రతిష్ఠకు భంగం కలిగిస్తున్నందున చంద్రబాబు, కేవీ రావుపై పరువునష్టం దావా వేయాలనుకుంటున్నాను అంటూ విజయసాయిరెడ్డి హెచ్చరించారు.