బుధవారం, 22 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : బుధవారం, 29 డిశెంబరు 2021 (17:47 IST)

రాష్ట్రంలో నక్సలిజం - టెర్రరిజం తగ్గింది.. లోకల్ మాఫియా పెరిగింది...

ఏపీలో అధికార వైకాపాకు చెందిన ఎమ్మెల్యే ఆనం రామనారాయణ రెడ్డి తాజాగా సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆయన బుధవారం నెల్లూరులో మాట్లాడుతూ, రాష్ట్రంలో నక్సలిజం, టెర్రరిజం తగ్గిందన్నారు. కానీ, లోకల్ మాఫియా పెరిగిపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. 
 
ఈ లోకల్ మాఫియాలో పోలీసోళ్లు కూడా భాగస్వామ్యులయ్యారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజల్లో పోలీసులపై ఒక న్యాయం చేస్తారన్న నమ్మకం, భరోసా ఉంది. పోలీసులే మాఫియాతో చేతులు కలిపితే ఇక సామాన్యులకు ఎలాంటి న్యాయం జరుగుతుందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. 
 
కాగా, గత ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే కాకుండా, టీడీపీ ప్రభుత్వంలో కూడా ఆయన కీలకంగా ఉన్నారు. ప్రస్తుతం ఆయన వైకాపా తరపున ఎమ్మెల్యేగా ఉన్నప్పటికీ ఆయన ఎక్కడ ఉన్నారో కూడా ఎవరికీ తెలియదు. కానీ, అపుడపుడూ సెన్సేషనల్ కామెంట్స్ చేస్తూ వార్తల్లో నిలుస్తుంటారు. తాజాగా అలాంటి వ్యాఖ్యలు చేసి వార్తలకెక్కారు.