శనివారం, 23 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By సెల్వి
Last Updated : శనివారం, 29 మే 2021 (15:03 IST)

ఆనందయ్య మందు పంపిణీకి అనుమతులు.. సైడ్ ఎఫెక్ట్స్ లేవట!

ఆనందయ్య మందు పంపిణీకి అనుమతులు రావడం లాంఛనంగా కనిపిస్తున్నాయి. తాజాగా సిసిఆర్ఏఏస్‌కి విజయవాడ పరిశోధన కేంద్రం సానుకూల నివేదిక పంపింది. విజయవాడ, తిరుపతి కేంద్రంగా 570 మంది శాంపిల్స్ సేకరించిన పరిశోధకులు.. ఆనందయ్య మందు స్వీకరించిన వారికి సైడ్ ఎఫెక్ట్స్ రాలేదంటూ నివేదిక పంపారు పరిశోధకులు. 
 
ఆనందయ్య మందుకు అనుమతులు వస్తే.. మందు పంపిణీ చేసే యోచనలో ఏపీ ప్రభుత్వం ఉంది. రోజుకి లక్ష మందికి మందు పంపిణీ తయారు చేసేందుకు పదార్థాల సేకరణలో ఆనందయ్య శిష్యులు ఉన్నారు. ఇప్పటికే వనమూలికల సేకరణలో 150 మంది ఆనందయ్య శిష్యులు ఉన్నారు. కాగా వారం రోజుల తర్వాత కృష్ణపట్నం లోని తన నివాసం వద్దకు చేరుకున్నారు ఆనందయ్య. 
 
పోలీస్ శాఖ ఆధ్వర్యంలో కృష్ణపట్నంలో పెద్ద ఎత్తున బందోబస్తు ఏర్పాటు చేశారు. కుటుంబ సభ్యులు తప్ప ఇంకెవరినీ అనుమతించం లేదు పోలీసులు.. వారం రోజులపాటు కృష్ణపట్నం పోర్టులోని సివిఆర్ ఫౌండేషన్‌లో ఉన్నారు ఆనందయ్య.