తోటి విద్యార్థితో ప్రేమలోపడిన వివాహిత... చివరకు మృత్యుఒడిలోకి...

తాను టీటీసీ చదువుతున్న సమయంలో ఓ యువకుడితో సాగించిన ప్రేమ ఓ మహిళ హత్యకు దారితీసింది. వివాహమైన తర్వాత కూడా తనతో అక్రమం సంబంధం కొనసాగించాలంటూ ఆ యువకుడు పట్టుబట్టగా, అందుకు ఆ మహిళ నిరాకరించింది.

deadbody
pnr| Last Updated: శనివారం, 8 సెప్టెంబరు 2018 (13:11 IST)
తాను టీటీసీ చదువుతున్న సమయంలో ఓ యువకుడితో సాగించిన హత్యకు దారితీసింది. వివాహమైన తర్వాత కూడా తనతో అక్రమం సంబంధం కొనసాగించాలంటూ ఆ యువకుడు పట్టుబట్టగా, అందుకు ఆ మహిళ నిరాకరించింది. దీంతో ఏకాంతంగా ఒక్కసారి మాట్లాడాలని చెప్పడంతో ఆ మహిళ అతని వెంట వెళ్లింది. ఇదే అదునుగా భావించిన ఆ యువకుడు వివాహితను చేశాడు.
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, అనంతపురం జిల్లా బుక్కపట్నం మండల కేంద్రానికి చెందిన విజయలక్ష్మికి అనంతపురం గణేష్‌ నగర్‌కు చెందిన బాలాజి అనే వ్యక్తితో గత మూడేళ్ల క్రితం వివాహమైంది. ఆమె విజయ పబ్లిక్‌ స్కూల్లో టీటీసీ చదువుతోంది. ఉపాధ్యాయ దినోత్సవం రోజున విజయ పబ్లిక్‌ స్కూల్లో పంక్షన్‌కు వెళున్నట్లు ఇంటివద్ద చెప్పి తిరిగిరాలేదు. 
 
దీంతో ఆమె బాలాజి టూటౌన్‌ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. ఈ పరిస్థితుల్లో విజయలక్ష్మి శివరాంపేట సమీపంలోని పొలాల్లో ఓ మృతదేహాన్ని స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారం చేరవేశారు. ఆ శవం తన భార్యదేని బాలాజీ నిర్ధారించాడు. దీంతో పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. 
 
ఈ విచారణలో అసలు విషయం వెల్లడైంది. విజయలక్ష్మి టీటీసీ చదువుతున్న సమయంలో తన తోటి విద్యార్థి కళ్యాణదుర్గంకు చెందిన ఓ యువకుడితో ప్రేమలోపడింది. అదికాస్త వారిమధ్య వివాహేతర సంబంధానికి దారితీసి పెళ్లయిన తర్వాత కూడా కొనసాగుతూ వచ్చింది. ఈ నేపథ్యంలో వారిద్దరి మధ్య ఏర్పడిన మనస్పర్థల కారణంగా విజయలక్ష్మిని పొలాల్లోకి తీసుకెళ్లి హత్య చేసినట్టు పోలీసుల విచారణలో వెల్లడైంది. దీనిపై మరింత చదవండి :