శుక్రవారం, 10 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : ఆదివారం, 29 మే 2022 (11:03 IST)

ఆస్తి కోసం తండ్రిపై హత్యాయత్నం .. కళ్ళలో కారం కొట్టి - గొడ్డలితో దాడి

murder
ఆస్తి కోసం కన్నతండ్రిపైనే ఓ కుమారుడు, కుమార్తె హత్యాయత్నానికి పాల్పడ్డారు. ఈ దారుణం అనంతపురం జిల్లా ఆత్మకూరు మండలం కుర్లపల్లిలో వెలుగు చూసింది. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, తమ పేరిట ఆస్తి రాసివ్వాలని కుర్లపల్లికి చెందిన నారాయణ స్వామిని కుమారులు జోగి రాజు, జోగి బాలచంద్ర, కుమార్తె మేనకు శనివారం అడిగారు. 
 
ఆస్తి పంచడానికి తండ్రి నారాయణ స్వామి నిరాకరించాడు. దీంతో ఆయన కళ్ళలో కారం కొట్టి గొడ్డలిని తిప్పేసి తలపై కొట్టి హత్యాయత్నం చేశారు. ఈ దాడిలో తీవ్రంగా గాయపడిన నారాయణ స్వామి స్థానికుల సహాయంతో అదే రోజు పోలీస్ స్టేషనులో ఫిర్యాదు చేశారు. 
 
దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు ఆదివారం నిందితులను అదుపులోకి తీసుకున్నారు. ఆ తర్వాత మేజిస్ట్రేట్ ఎదుట హాజరుపరి జైలుకు తరిలంచారు. వీరికి మేజిస్ట్రేట్ 14 రోజుల పాటు రిమాండ్‌ విధిస్తూ ఆదేశించారు.