గురువారం, 23 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By జె
Last Modified: శనివారం, 20 నవంబరు 2021 (22:13 IST)

పురాతన మండపం కుప్పకూలింది, ఎక్కడ?

తిరుపతి అంటేనే పుణ్యక్షేత్రం. ఆలయాలకు నిలయం. అలాంటి ప్రాంతంలో వరద బీభత్సం కారణంగా ఎన్నో ఇబ్బందులు పడ్డారు స్థానికులు. ఇప్పటికీ పడుతూనే ఉన్నారు. అయితే ఎన్నో యేళ్ళ చరిత్ర కలిగిన పురాతన మండపం కూడా కుప్పకూలింది.

 
తిరుపతిలో టిటిడి ఆధ్వర్యంలో నడపబడే కపిలేశ్వర ఆలయంలో వరద ఉధృతి నిన్న ఎక్కువైంది. నిన్న సాయంత్రానికి నాలుగు స్తంభాలు బీటలు వారాయి. దీంతో వేణుగోపాలస్వామి ఆలయానికి ఎదురుగా ఉన్న మండపం ఒక్కసారిగా కుప్పకూలింది.

 
అయితే మండపం కుప్పకూలే సమయంలో కింద ఎవరూ లేకపోవడంతో పెనుప్రమాదం తప్పింది. గత మూడురోజుల నుంచి కురుస్తున్న వర్షాలతో జనజీవనం స్తంభించడం.. భక్తుల రాకపోకలు తగ్గువగా ఉండడంతో కపిలతీర్థంలో భక్తుల దర్శనాన్ని కూడా టిటిడి నిలిపివేసింది.