శనివారం, 28 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By సెల్వి
Last Updated : ఆదివారం, 24 నవంబరు 2024 (15:22 IST)

సింగపూర్‌తో వైకాపా తెగతెంపులు.. ఏం జరిగిందో కనుక్కోండి.. బాబు

Chandra babu
సింగపూర్ ప్రభుత్వంతో వైఎస్సార్‌సీపీ హయాంలో తెగతెంపులు చేసుకున్న సంబంధాలను   పునరుద్ధరించాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఎన్ చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. 
 
2019-2024 మధ్య ఏమి జరిగిందో వివరించడానికి, కోల్పోయిన సుహృద్భావాన్ని పునరుద్ధరించడానికి ఆగ్నేయాసియా నగర రాష్ట్ర అధికారులను కలవాలని ముఖ్యమంత్రి బ్యూరోక్రాట్‌లను ఆదేశించారు. 
 
సింగపూర్‌తో ఏపీ సంబంధాలను పునరుద్ధరించడానికి సింగపూర్ ప్రభుత్వాన్ని కలవండి, ఏమి జరిగిందో వివరించండి, పరస్పర విశ్వాసాన్ని పెంపొందించడానికి చర్యలు తీసుకోండని.. బాబు ఆదేశాలు జారీ చేశారు. 
 
వైఎస్ జగన్మోహన్ రెడ్డి నేతృత్వంలోని వైకాపా హయాంలో ఒప్పందాలను ఏకపక్షంగా రద్దు చేయడం వల్ల ఏపీ బ్రాండ్ ఇమేజ్ దెబ్బతింది.
 
 దీంతో ప్రపంచ స్థాయిలో ఆంధ్రప్రదేశ్‌కు నష్టం వాటిల్లిందని ఆరోపించిన సీఎం.. అంతర్జాతీయంగా ఏపీ ప్రతిష్టను పునరుద్ధరించుకోవాల్సిన అవసరం ఉందని, రాష్ట్రాభివృద్ధికి అంతర్జాతీయ సహకారం ఎంతో కీలకమని చంద్రబాబు వ్యాఖ్యానించారు.