ఆదివారం, 2 ఫిబ్రవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : శుక్రవారం, 29 సెప్టెంబరు 2023 (15:56 IST)

స్కిల్ కేసులో నారా లోకేశ్‌కు ఊరట.. ఫైబర్ గ్రిడ్ కేసు వాయిదా...

nara lokesh
స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌కు భారీ ఊరట లభించింది. ఈ కేసులో ఏపీ సీఐడీ పోలీసులు అరెస్టు చేయకుండా ముందస్తు బెయిల్ మంజూరు చేసింది. అక్టోబరు నాలుగో తేదీ వరకు ఆయనకు ముందస్తు బెయిల్ మంజూరు చేసింది. అప్పటివరకు అరెస్టు చేయొద్దని హైకోర్టు ఆదేశించింది. తదుపరి విచారణను అక్టోబరు 5వ తేదీకి వాయిదా వేసింది. 
 
మరోవైపు, ఏపీ ఫైబర్ గ్రిడ్ కేసులో నారా లోకేశ్ పెట్టుకున్న ముందస్తు బెయిల్ పిటిషన్‌పై మాత్రం విచారణ వాయిదా వేసింది. ఈ కేసులో విచారణను అక్టోబరు నాలుగో తేదీన వాయిదా వేస్తున్నట్టు తెలిపింది. మరోవైపు, అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో లోకేశ్‌కు 41ఏ నోటీసులు ఇవ్వాలని ఏపీ సీఐడీని హైకోర్టు ఆదేశిస్తూ, ఈ కేసు విచారణను ముగించింది. ఈ కేసులో లోకేశ్ విచారణకు సహకరించకుంటే అపుడు అరెస్టు చేసే అవకాశం ఉంది.