సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By సెల్వి
Last Updated : గురువారం, 11 నవంబరు 2021 (19:30 IST)

ఏపీలో భారీ వర్షాలు... స్వర్ణముఖి బ్యారేజీకి భారీగా వరద నీరు

Rains
ఏపీలో కురుస్తున్న భారీ వర్షాలతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. తిరుపతిలో వర్షాలు బీభత్సానికి భారీ వృక్షాలు నెలకొరిగాయి. నెల్లూరు జిల్లా వ్యాప్తంగా వానలు భారీ కురుస్తున్నాయి.
 
ఈ నేపథ్యంలో గూడూరు, పంబలేరు వాగుకు భారీగా వర్షపు నీరు వచ్చిచేరుతోంది. ఈ క్రమంలో జాతీయ రహదారి నిర్మాణ పనులు నిలిచిపోయాయి. విజయవాడ-చైన్నై జాతీయ రహదారిపై రాకపోకలకు కూడా నిలిచిపోయే అవకాశం కనిపిస్తోంది.
 
అంతేకాకుండా భారీ వర్షాల కారణంగా స్వర్ణముఖి బ్యారేజీకి భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. దీంతో పాటు కావలి తుమ్మలపెంట వద్ద సముద్రం 100 అడుగులు మందుకు వచ్చింది. 10 అడుగుల ఎత్తులో అలలు ఎగిసిపడుతున్నాయి. సూళ్లురుపేటలోని కాలంగి నది పొంగిపొర్లుతోంది. దీంతో 40 గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి.