శుక్రవారం, 24 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By సెల్వి
Last Updated : గురువారం, 20 మే 2021 (12:09 IST)

ఆంధ్రప్రదేశ్ బడ్జెట్‌: బీసీ సంక్షేమంలో 8 శాతం అధిక కేటాయింపులు

ఆంధ్రప్రదేశ్ బడ్జెట్‌ని ఆర్ధిక మంత్రి బుగ్గన రాజేంద్ర నాథ్ రెడ్డి ప్రవేశ పెట్టారు. 2021-22 రాష్ట్ర బడెట్‌ అంచనా రూ. 2,29,779.27 కోట్లుగా తెలిపారు. గత ఆర్థిక సంవత్సరం బడ్జెట్‌ అంచనా రూ. 2,24,789.18 కోట్లని ఆయన వివరించారు. 
 
ఎవరెవరికి ఎంతెంత? కేటాయింపు చేసింది ఆయన సభలో చదివి వినిపించారు. 2020-21తో పోలిస్తే వెనకబడిన కులాల బడ్జెట్‌లో 32 శాతం అధికంగా కేటాయింపులు, బడ్జెట్‌లో రూ. 28,237 కోట్లు అని చెప్పారు. ( 2020-21లో రూ.21,317.24 కోట్లు)గా చెప్పారు.
 
ఈ బీసీ సంక్షేమంలో 8 శాతం అధిక కేటాయింపులు, బడ్జెట్‌ రూ.5,478కోట్లుగా ఉంది. (2020-21లో రూ.5,088.55 కోట్లు) కాపు సంక్షేమం కోసం 7 శాతం అధిక కేటాయింపులు, 3,306 కోట్లు, (2020-21లో రూ.3,090 కోట్లు), బ్రాహ్మణుల సంక్షేమంలో 189 శాతం అధిక కేటాయింపులు, రూ.359 కోట్లు, (2020-21లో రూ.124 కోట్లు), ఎస్సీ 
 
సబ్‌ప్లాన్‌లో 22 శాతం అధిక కేటాయింపులు, రూ. 17403 కోట్లు, (2020-21లో రూ. 14,218కోట్లు), ఎస్టీ సబ్‌ప్లాన్‌లో 27శాతం అధిక కేటాయింపులు, రూ. 6,131కోట్లు, (2020-21లో రూ.4,814 కోట్లు) కేటాయించామన్నారు.