గురువారం, 23 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : గురువారం, 16 మార్చి 2023 (08:41 IST)

నేడు ఏపీ అసెంబ్లీ బడ్జెట్ : రూ.2.79 లక్షల కోట్లతో వార్షిక ప్రణాళిక?

minister buggana
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వార్షిక బడ్జెట్‌ను ఆ రాష్ట్ర విత్తమంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి గురువారం శాసనసభలో ప్రవేశపెట్టనున్నారు. 2023-24 ఆర్థిక సంవత్సరానికిగాను మొత్తం రూ.2.79 లక్షల కోట్ల వ్యయ ప్రణాళికతో ఈ బడ్జెట్‌ను ఏపీ సర్కారు రూపకల్పన చేసినట్టు వార్తలు వస్తున్నాయి. గురువారం రాష్ట్ర శాససనసభలో ఉదయం 10 గంటలకు మంత్రి అసెంబ్లీలో ప్రవేశపెడతారు. 
 
అలాగే, అసెంబ్లీలో వ్యవసాయ బడ్జెట్‌ను మంత్రి కాకాణి గోవర్థన్ రెడ్డి, శాసన మండలిలో డిప్యూటీ సీఎం అంజాద్ బాషా, వ్యవసాయ బడ్జెట్‌ను మంత్రి సీదిరి అప్పలరాజులు ప్రవేశపెడతారు. ముఖ్యమంత్రి జగన్ తన పాదయాత్ర సమయంలోనూ, ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలు పూర్తి స్థాయిలో నెరవేర్చేందుకు ఈ బడ్జెట్‌లో నిధులు కేటాయింపు ఉంటుందా లేదా అన్నది మరికొన్ని గంటల్లో తేలిపోనుంది. 
 
అలాగే, ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న నవరత్నాలు కాకుండా ఇతరత్రా అనేక ప్రాజెక్టులను కూడా సీఎం జగన్ ఇచ్చిన హామీల మేరకు అమలు చేయాల్సివుంది. అయితే, ఇప్పటికే గత నాలుగు సంవత్సరాలుగా మూలధన వ్యయం రూపంలో ఖర్చు ఖర్చు చాలా తక్కువగా ఉంది. 
 
కేటాయింపులలకు అభివృద్ధిపై నిధుల ఖర్చుకూ పొంతనలేని పరిస్థితులు నెలకొనివున్నాయి. ఈ నేపథ్యంలో కొత్త బడ్జెట్ రూపకల్పన సమయంలో కూడా ఆర్థిక శాఖ అనేక ఆంక్షలు విధించింది. ఈ నేపథ్యంలో కీలక ప్రాజెక్టులకు కీలక రంగాలకు నిధులు కేటాయింపు ఆశించిన స్థాయిలో ఉంటుందా లేదా అన్నది తెలియాల్సివుంది.