సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్

నేడు విజయవాడలో జస్టిస్ ఎన్వీ రమణ : కోర్టు భవనాల ప్రారంభం

nvramana
సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ శనివారం విజయవాడలో పర్యటించనున్నారు. ప్రస్తుతం తిరుమలలో శ్రీవారిని దర్శనం చేసుకున్న ఆయన రాత్రికి తిరుపతిలోనే బస చేశారు. శనివారం ఉదయం విజయవాడకు చేరుకుంటారు. అక్కడ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డితో కలిసి విజయవాడ సిటీ సివిల్ కోర్టు భవనాన్ని ప్రారంభిస్తారు. 
 
శుక్రవారం రాత్రి తిరుపతిలో జరిగిన ఓ కార్యక్రమంలో ఆయన పాల్గొని మహత్మా గాంధీపై రాసిన ఓ పుస్తకాన్న ఆయన ఆవిష్కరించారు. శనివారం ఉదయం విజయవాడకు చేరుకునే ఆయన... సిటీ సివిల్ కోర్టు భవన ప్రాంగణంలో కొత్తగా బహుళ అంతస్తులతో కూడిన సిటీ సివిల్ కోర్టు భవన సముదాయాన్ని ఏపీ ప్రభుత్వం ఇటీవలే నిర్మించింది. వీటిని జస్టిస్ రమణ ప్రారంభిస్తారు.