ఆదివారం, 5 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By సెల్వి
Last Updated : బుధవారం, 27 ఏప్రియల్ 2022 (13:12 IST)

క్రికెట్ ఆడుతూ గొడవ.. బ్యాట్‌తో కొట్టడంతో 9వ తరగతి విద్యార్థి మృతి

క్రికెట్ ఆడుతుండగా ఏర్పడిన గొడవతో తొమ్మిదో తరగతి విద్యార్థి ప్రాణాలు కోల్పోయిన ఘటన కాకినాడలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. కాకినాడ జిల్లా సామర్లకోట మండలంలోని జి.కొత్తూరు గ్రామానికి చెందిన బాలుడు 7వ తరగతి.. నంగి సూర్య (14) 9వ తరగతి చదువుతున్నారు. 
 
సోమవారం సాయంత్రం క్రికెట్ ఆడుతున్న సమయంలో రెండు వర్గాల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. ఈ క్రమంలో సూర్య వెళ్తున్న సైకిల్‌ను మరో బాలుడు తన్నాడు.
 
దీంతో ఇద్దరు గొడవకు దిగగా.. అక్కడ ఉన్న యువకులు వారిని విడిపించారు. అనంతరం కింద పడిపోయిన సైకిల్‌ను సూర్య తీసుకుంటుండగా.. వెనుకనుంచి ఆ బాలుడు బ్యాట్‌తో తలపై కొట్టాడు. స్పృహ తప్పి కిందపడిపోయిన సూర్య.. కాసేపయ్యాక తేరుకున్నాడు. 
 
అలా ఇంటికెళ్లి నిద్రపోయాడు. తెల్లవారు జామున నిద్రపోతున్న సూర్యను లేపగా.. అతను లేవలేదు. గురక వస్తుండడంతో వెంటనే బిక్కవోలు ఆసుపత్రికి తీసుకెళ్లాడు.
 
అయితే అప్పటికే ఆ సూర్య మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. అనంతరం పిల్లల మధ్య జరిగిన ఘర్షణ గురించి తెలుసుకున్న సూర్య తాత పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు క్రికెట్ ఆటలో జరిగిన ఘర్షణ అని.. వారి మధ్య ఎటువంటి పూర్వ తగాదాలు లేవని తెలిపారు.