ఆదివారం, 22 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By సెల్వి
Last Updated : శనివారం, 9 నవంబరు 2024 (15:15 IST)

సీ ప్లేన్‌లో ప్రయాణించిన ఏపీ సీఎం చంద్రబాబు.. 30 నిమిషాలే జర్నీ (video)

Chandra babu
Chandra babu

విజయవాడలోని పున్నమిఘాట్‌ నుంచి శ్రీశైలం వరకు ముఖ్యమంత్రి చంద్రబాబు "సీ ప్లేన్"లో ప్రయాణించారు. ఈ సీ ప్లేన్‌లో విజయవాడ నుంచి శ్రీశైలం వరకు ఎగరనుంది. దాదాపు 150 కిలోమీటర్ల దూరాన్ని 1,500 అడుగుల ఎత్తులో ప్రయాణించాల్సి ఉంటుంది. 
 
విజయవాడ నుంచి శ్రీశైలం వెళ్లడానికి సీ ప్లేన్‌లో వెళ్లడానికి కేవలం 20 నిమిషాలే పడుతుంది. అయితే టేకాఫ్, ల్యాండింగ్‌ చేయడనికి మాత్రం మరో 10 నిమిషాల టైం తీసుకుంటారు. విజయవాడలో జరిగిన కార్యక్రమంలో కేంద్రమంత్రి రామ్మోహన్‌ నాయుడు, ఇతర కేంద్ర రాష్ట్ర మంత్రులు, ప్రజాప్రతినిధులు, అధికారులు ఈ ప్రారంభోత్సవంలో పాల్గొన్నారు. 
 
విజయవాడలోని పున్నమిఘాట్‌ లోని జలాల్లో టేకాఫ్‌ అయి శ్రీశైలంలో జలాల్లో ల్యాండ్ అవుతుంది. మళ్లీ అక్కడ టేకాఫ్‌ అయిన తర్వాత పున్నమిఘాట్‌లో ల్యాండ్ అవుతుంది. ఈ ప్లేన్ ల్యాండింగ్, టేకాఫ్ కోసం నీటిపై ప్రత్యేకంగా జెట్టీలను సిద్ధం చేశారు.
 
దేశవ్యాప్తంగా ఇలాంటి సీప్లేన్‌ అందుబాటులోకి తీసుకురావాలని ఎప్పటి నుంచో కేంద్రం ఆలోచిస్తోంది. తాజాగా ఏపీలో సీప్లేన్ అందుబాటులోకి రానుంది. విజయవాడ నుంచి శ్రీశైలం మధ్య నడిచే సీప్లేన్‌ టికెట్ల రేట్లు ఇంకా నిర్ణయించలేదు. 
 
పర్యాటకులను ఆకర్షించడం, ఈ సుందరమైన ప్రదేశాలకు సులభంగా చేరుకునేలా ప్రయాణం సౌకర్యవంతం చేయాలని చూస్తోంది. హైదరాబాద్-శ్రీశైలం మార్గం సహా వివిధ ప్రాంతాలకు సీప్లేన్‌లను నడపడానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వంతో చర్చలు జరుపుతోంది.