గురువారం, 23 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By సెల్వి
Last Updated : మంగళవారం, 26 సెప్టెంబరు 2023 (22:14 IST)

ఒకవైపు బ్లేడ్, మరోవైపు రైల్వే ట్రాక్‌పై ట్రైన్.. కానిస్టేబుల్ అదుర్స్

Police
Police
ప్రాణాలను పణంగా పెట్టి ఓ మహిళను కానిస్టేబుల్ కాపాడాడు. కట్టుకున్న భర్త భార్యపై దాడి చేస్తుంటే అడ్డుకుని.. తన ప్రాణాలను కూడా లెక్క చేయకుండా ఆ మహిళను కాపాడారు. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఆ పోలీసు ప్రదర్శించిన ధైర్యసాహసాలపై నెటిజన్లు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. 
 
వివరాల్లోకి వెళితే.. ఏలూరు శివారులోని వట్లూరు రైల్వే ట్రాక్‌పై ఒక యువకుడు తన భార్యను బ్లేడ్‌తో దాడి చేశాడు. ఈ సమాచారం తెలుసుకున్న సదరు కానిస్టేబుల్ రైల్వే ట్రాక్ పైకి వెళ్లి చాకచక్యంగా భర్త చేతుల్లో నుంచి భార్యను రక్షించాడు. 
 
ఒక వైపు యువకుడి చేతుల్లో బ్లేడ్, మరోవైపు రైల్వే ట్రాక్‌పై ట్రైన్, అయినా సరే ప్రాణాలను లెక్కచేయకుండా భార్యపై దాడి చేస్తున్న భర్తను నిలువరించి ఆ మహిళను కానిస్టేబుల్ కాపాడాడు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది.