గురువారం, 9 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By సెల్వి
Last Updated : శుక్రవారం, 9 జూన్ 2023 (14:42 IST)

లారీ యార్డులో బాలుడి మృతదేహం.. చేతిపై రెండు గాట్లు

crime scene
ఏపీ విశాఖ జిల్లాలో అనుమానాస్పదంగా ఓ బాలుడు ప్రాణాలు కోల్పోవడం స్థానికంగా కలకలం రేపింది. పెందుర్తిలోని ఎస్‌ఆర్‌కే పురంలో ఈ ఘటన జరిగింది. 
 
ఎస్‌ఆర్‌పురం గ్రామానికి చెందిన కనకరాజు, నారాయణమ్మ దంపతుల కుమారుడు తేజ గురువారం రాత్రి కనిపించకుండా పోయాడు. కుటుంబ సభ్యులు ఎంత వెతికినా.. ఆచూకీ కనబడలేదు. దీంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో మిస్సింగ్ కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. 
 
ఈ క్రమంలోనే తేజ మృతదేహాన్ని శుక్రవారం లారీ యార్డులో గుర్తించారు. బాలుడి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం మార్చురీకి తరలించారు. 
 
బాలుడి చేతిపై రెండు చిన్న గాట్లు ఉన్నట్లు గుర్తించారు. తేజ మరణంపై తల్లిదండ్రులు కొందరిపై అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.