శనివారం, 11 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : గురువారం, 25 నవంబరు 2021 (14:56 IST)

చెయ్యేరు వాగు నుంచి వరద : రాజంపేట 38 మంది గల్లంతు...

ఇటీవల ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విస్తారంగా వర్షాలు కురిశాయి. ముఖ్యంగా, నెల్లూరు, చిత్తూరు, కడప, అనంతపురం జిల్లాల్లో కుంభవృష్ణ కురిసింది. దీంతో ఈ జిల్లాలను వరద నీరు ముంచెత్తింది. అనేక ప్రాంతాల్లో వాగులు పొంగిపొర్లాయి. కడప జిల్లాలో అన్నమయ్య ప్రాజెక్టు తెగిపోయింది. ఈ వరద నీరు ఒక్కసారిగా ముంచెత్తడంతో అనేక మంది గల్లంతయ్యారు. 
 
ఇపుడు రాజంపేటలో వచ్చిన వరద నీటి ప్రవాహానికి 38 మంది గల్లంతు అయినట్టు తేలింది. వీరిలో 13 మంది ఆచూకీ ఇంకా తెలియరాలేదని స్థానికులు అంటున్నారు. వీరి కోసం సహాయక బృందాలు ముమ్మరంగా గాలిస్తున్నాయి. రాజంపేటలో చెయ్యేరు వాగు ఉప్పొంగడం వల్ల ఈ ప్రమాదం సంభవించింది.