సోమవారం, 25 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By సెల్వి
Last Updated : గురువారం, 26 నవంబరు 2020 (22:00 IST)

ఏపీ సర్కారు సంచలనం నిర్ణయం.. మహిళా ఖైదీలను..?

ఏపీలోని వైకాపా సర్కారు సంచలన నిర్ణయం తీసుకుంది. ఏపీ మహిళా ఖైదీలకు సర్కార్ గుడ్ శుభవార్త చెప్పింది. యావజ్జీవ శిక్షను అనుభవిస్తున్న మహిళా ఖైదీలను ముందుగానే విడుదల చేయాలని నిర్ణయించింది. ఆంద్రప్రదేశ్‌లోని వివిధ జైళ్లలో మొత్తం 53 మంది మహిళా ఖైదీల విడుదలకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. 
 
అయితే, వీరి విడుదలకు కొన్ని షరతులను విధించింది. విడుదల కాబోయే మహిళా ఖైదీలు రూ.50వేలు పూచికత్తు సమర్పించాలని ఆదేశించింది. శిక్షా కాలం పరిమితి ముగిసే వరకు ప్రతి మూడు నెలలకు ఒకసారి పోలీస్ స్టేషన్‌లో హాజరు కావాలని ఆదేశించింది. అలానే బయటకు వెళ్లిన తరువాత ఎలాంటి నేరాలకు పాల్పడినా వెంటనే మళ్లీ అరెస్ట్ చేసి ముందస్తు విడుదలను రద్దు చేస్తామని హెచ్చరించింది.