Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

ఆర్థిక ఇబ్బందుల్లో రాష్ట్రం... మంత్రి యనమల

గురువారం, 14 సెప్టెంబరు 2017 (17:23 IST)

Widgets Magazine
yanamala

అమరావతి: రాష్ట్రంలో ఆర్థిక పరిస్థితి క్లిష్టంగా ఉన్నట్లు సచివాలయం 2వ బ్లాక్ లోని తన చాంబర్‌లో ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు గురువారం ఉదయం నిర్వహించిన  తమ శాఖ సమీక్షలో స్పష్టమైంది. ఎఫ్ఆర్ బీఎం(ఫిస్కల్ రెస్పాన్సబిలిటీ అండ్ బడ్జెట్ మేనేజ్ మెంట్) చట్టం ప్రకారం ఈ ఆర్థిక సంవత్సరం అర్థ సంవత్సరంలో రాష్ట్ర ప్రభుత్వం రూ. 23,794 కోట్లు రుణం తీసుకోవడానికి అవకాశం ఉందని, ఇప్పటివరకు రూ.16 వేల కోట్లు రుణం తీసుకున్నట్లు ఆర్థిక శాఖ ప్రత్యేక ముఖ్య కార్యదర్శి రవిచంద్ర వివరించారు. మరోవిడత రుణం తీసుకునే అవకాశం ఉందని తెలిపారు. 
 
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఇబ్బందికరంగా ఉందన్నారు. వర్క్ కాంట్రాక్ట్స్ పైన జీఎస్టీ 12 శాతానికి పెంచడంతో రాష్ట్ర ప్రభుత్వంపై రూ.600 నుంచి రూ.700 కోట్ల అదనపు భారం పడుతుందని చెప్పారు. రైతు రుణ మాఫీకి రూ.3 వేల కోట్లు, డ్వాక్రా గ్రూపులకు రూ.2 వేల కోట్లు విడుదల చేస్తున్నట్లు తెలిపారు. రాష్ట్రంలో నెలకొన్న ఆర్థిక పరిస్థితులను ఎదుర్కోవడానికి బ్యాంకుల నుంచి రుణాలు తీసుకుంటున్నట్లు చెప్పారు. 
 
ఏపీఐఐసీ, రైతు సాధికార సంస్థ, మహిళా సాధికార సంస్థ, ఇరిగేషన్, వాటర్ రిసోర్సెస్, డ్రింకింగ్ వాటర్, ఏపీయుఐడీసీ, రోడ్ల అభివృద్ధి, పవర్ ఫైనాన్స్... వంటి కార్పోరేషన్లకు రుణాలు తీసుకోవడానికి ప్రభుత్వం అనుమతి ఇచ్చినట్లు తెలిపారు. ఆ కార్పోరేషన్లు స్వతంత్రంగా రుణం తీసుకుంటే బ్యాంకులు వడ్డీ ఎక్కువ వసూలు చేస్తాయని, ప్రభుత్వం గ్యారంటీ ఇస్తే తక్కువ వడ్డీ వసూలు చేస్తాయని, అందువల్ల ప్రభుత్వం గ్యారంటీ ఇస్తున్నట్లు మంత్రి వివరించారు. ఈ సమీక్షా సమావేశంలో ఆర్థిక శాఖ ప్రత్యేక కార్యదర్శి హేమా మునివెంకటప్ప, ఆడిట్ శాఖ డైరెక్టర్ డి.శ్రీనివాసరావు, డిప్యూటీ డైరెక్టర్ విజయ కుమారి  తదితరులు పాల్గొన్నారు.Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు వార్తలు

news

కోమటి రెడ్డి బ్రదర్స్‌పై గుత్తా ఫైర్: కేసీఆర్ ఐరెన్ లెగ్.. వాస్తు పిచ్చి పట్టుకుంది...

కోమటిరెడ్డి బ్రదర్స్ ఓ వైపు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ను తిడుతూనే, టీఆర్ఎస్‌లోకి వచ్చే ...

news

ఒప్పుకో... లేదంటే ఫ్రెండ్స్‌ని పిలిచి గ్యాంగ్ రేప్ చేయిస్తా... యువతిపై అత్యాచారం

ఢిల్లీలో ఓ యువతిపై కామాంధుడు అత్యాచారం చేసిన ఘటన మంగళవారం చోటుచేసుకుంది. అత్యాచారం ...

news

డేరాబాబాకు దిక్కులేదు.. ఒక్కరూ రాలేదు.. తీవ్ర ఒత్తిడిలో గుర్మీత్.. చేసిన పాపాలకు?

రేపిస్ట్ గుర్మీత్ సింగ్ రోహ్‌తక్ జైలులో శిక్ష అనుభవిస్తున్నాడు. ఇతడు జైలుకొచ్చి 15 రోజులు ...

news

ఆమెకి ఇద్దరు... ఆమె కోసం వాళ్లు కొట్టుకుంటున్నారు... ఏం చేద్దాం?

ఇటీవలి కాలంలో ఇలాంటి కేసులు ఎక్కువవుతున్నాయి. ఒకే స్త్రీ ఇద్దరు వ్యక్తులను... అంటే ఒకరు ...