సోమవారం, 18 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By సిహెచ్
Last Modified: బుధవారం, 29 జూన్ 2022 (22:47 IST)

కోలుకుంటున్న ఏపీ, శ్రామికశక్తికి అవకాశాల గనిగా ఆంధ్రప్రదేశ్‌

amaravati
వృద్ధి చెందుతున్న భారత ఆర్థిక వ్యవస్థకు తోడ్పాటునందిస్తూ, అతి ముఖ్యమైన వాణిజ్య కేంద్రంగా గత కొద్దినెలలుగా పలు కంపెనీలకు నిలుస్తూ తనను తాను ఆంధ్రప్రదేశ్‌ మార్చుకుంటుందని అప్నా డాట్‌ కో వెల్లడించింది. భారతదేశంలో అతిపెద్ద ప్రొఫెషనల్‌, జాబ్‌ ప్లాట్‌ఫామ్‌ ఇది. ఈ రాష్ట్రం దాదాపు ఒక లక్ష ఉద్యోగావకాశాలను గత 90 రోజులలో ఉద్యోగార్ధులకు కల్పించింది.

 
దక్షిణ భారతదేశానికి ఓ ఆభరణంగా నిలుస్తోన్న విశాఖపట్నం, ఆంధ్రప్రదేశ్‌లో ఎంతోమంది ప్రొఫెషనల్స్‌కు అవకాశాల ప్రదాతగా నిలిచింది. ఆంధ్రప్రదేశ్‌లో అవకాశాలు పెరగడంతో ఎంతోమంది వినియోగదారులు రాష్ట్రంలో ఉద్యోగావకాశాల కోసం వెదకడం ప్రారంభించారు. నిజానికి అప్నా డాట్‌ కో విడుదల చేసిన తాజా సమాచారం ప్రకారం రాష్ట్రంలో వినియోగదారుల సంఖ్య 2020 నుంచి 2021 మధ్యకాలంలో పెరిగింది.

 
ఈ త్రైమాసంలో టెలికాలర్లు, డేటా ఎంట్రీ ఆపరేటర్లు, రిలేషన్‌షిప్‌ మేనేజర్లు, కస్టమర్‌ కేర్‌ ఎగ్జిక్యూటివ్‌లు ఆంధ్రప్రదేశ్‌లో అత్యంత ప్రాచుర్యం పొందారు. అదేసమయంలో విశాఖపట్నంలో అధికశాతం మంది కాల్‌ సెంటర్‌ ఎగ్జిక్యూటివ్స్‌, టెలి సేల్స్‌ విధులలో చేరేందుకు ఆసక్తి చూపుతుండగా, గుంటూరు వాసులు బిజినెస్‌ డెవలప్‌మెంట్‌ అసోసియేట్లుగా, డెలివరీ పార్టనర్స్‌గా చేయడానికి ఆసక్తి చూపుతున్నారు. విజయవాడలో టెలికాలర్లు, ఫీల్డ్‌ సేల్స్‌ ఎగ్జిక్యూటివ్‌లుగా చేయడానికి ఆసక్తి కనబరుస్తున్నారు.

 
ఆంధ్రప్రదేశ్‌లో గత త్రైమాసంలో ఉద్యోగాల కోసం దరఖాస్తు చేసిన వారిలో 46% మంది హయ్యర్‌ సెకండరీ విద్యను పూర్తి చేయడం లేదా అంతకంటే తక్కువ విద్యార్హతలు కలిగి ఉన్నారు. ఈ వృద్ధి గురించి మానస్‌ సింగ్‌, చీఫ్‌ బిజినెస్‌ ఆఫీసర్‌, అప్నా డాట్‌ కో మాట్లాడుతూ, ‘‘దేశంలో వృద్ధి చెందుతున్న శ్రామికశక్తికి  అవకాశాల గనిగా ఆంధ్రప్రదేశ్‌ మారుతుంది. ఉద్యోగాల పరంగా మాత్రమే కాదు ప్రొషెషనల్స్‌ పరంగా కూడా అప్నా వారి నడుమ ఓ వారధిలా పనిచేస్తుంది. ఈ రాష్ట్రం మరింతగా అబివృద్ధి చెందుతుందని భావిస్తున్నాము’’ అని అన్నారు.