సోమవారం, 25 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By వరుణ్
Last Updated : మంగళవారం, 16 జులై 2024 (19:37 IST)

ల్యాండ్ టైటలింగ్ యాక్ట్ రద్దు... నూతన ఇసుక పాలసీకి ఆమోదం.. ఏపీ మంత్రివర్గం

ap cabinet
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రిమండలి సమావేశం మంగళవారం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన జరిగింది. దాదాపు రెండున్నర గంటల పాటు సాగిన ఈ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ముఖ్యంగా, ల్యాండ్ టైటలింగ్ యాక్ట్‌ను రద్దుకు మంత్రిమండలి ఆమోదముద్ర వేసింది. అలాగే రాష్ట్రంలో కొత్త ఇసుక విధానం అమలుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. 
 
వెలగపూడిలోని రాష్ట్ర సచివాలయంలో ఈ మంత్రిమండలి సమావేశం జరిగింది. ఇందులో కొత్త ఇసుక పాలసీ కోసం విధి విధానాలను రూపకల్పన చేయాలని మంత్రిమండలి నిర్ణయించింది. పౌర సరఫరాల శాఖ రూ.2 వేల కోట్ల రుణం తీసుకునేందుకు ప్రభుత్వ గ్యారెంటీకి ఆమోదం లభించింది. 
 
రైతు నుంచి ధాన్యం కొనుగోలు ఎన్సీడీసీ నుంచి రూ.3200 కోట్ల రుణానికి క్యాబినెట్ ఆమోదం తెలిపింది. ఈ మేరకు రుణం తీసుకునేందుకు వ్యవసాయ, సహకార కార్పొరేషన్‌కు ప్రభుత్వ క్యారంటీకి క్యాబినెట్ సమ్మతం తెలిపింది. అలాగే, ఈ నెల 22వ తేదీ నుంచి రాష్ట్ర అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలని నిర్ణయించింది. ఇందులో 2024-25 ఆర్థిక సంవత్సరానికిగాను వార్షిక బడ్జెట్‌ను ప్రవేశపెట్టనుంది.