శుక్రవారం, 24 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By సెల్వి
Last Updated : మంగళవారం, 2 ఫిబ్రవరి 2021 (19:59 IST)

ఏపీలో గడిచిన 24 గంటల్లో 104 మందికి పాజిటివ్

ఏపీలో గడచిన 24 గంటల్లో 29,309 కరోనా టెస్టులు నిర్వహించగా 104 మందికి పాజిటివ్ అని వెల్లడైంది. అత్యధికంగా విశాఖ జిల్లాలో 27, కృష్ణా జిల్లాలో 25, చిత్తూరు జిల్లాలో 17 కేసులు నమోదయ్యాయి. ప్రకాశం జిల్లాలో ఒక్క కేసు కూడా నమోదు కాలేదు. 
 
విజయనగరం జిల్లాలో 2, శ్రీకాకుళం జిల్లాలో 2, నెల్లూరు జిల్లాలో 2, కర్నూలు జిల్లాలో 3, అనంతపురం జిల్లాలో 3 కొత్త కేసులు గుర్తించారు. అదే సమయంలో 147 మంది కరోనా నుంచి కోలుకుని ఆరోగ్యవంతులు కాగా, ఇద్దరు మరణించారు. 
 
రాష్ట్రంలో ఇప్పటివరకు 8,88,004 పాజిటివ్ కేసులు నమోదు కాగా 8,79,651 మంది ఆరోగ్యవంతులయ్యారు. ఇంకా 1,197 మందికి చికిత్స జరుగుతోంది. అటు, మొత్తం మరణాల సంఖ్య 7,156కి పెరిగింది.