గురువారం, 23 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By వరుణ్
Last Updated : సోమవారం, 3 ఏప్రియల్ 2023 (10:46 IST)

నేటి నుంచి ఏపీలో ఒంటిపూట బడులు

schools
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సోమవారం నుంచి ఒంటిపూట బడులు ప్రారంభమయ్యాయి. ఒకవైపు పదో తరగతి పరీక్షలు జరుగుతున్నాయి. ఒంటిపూట బడులు కూడా ఈ రోజు నుంచి ఆరంభం అవుతున్నాయి. ఒకటో తరగతి నుంచి పదో తరగతి ఉదయం 7.45 గంటల నుంచి 12.30 వరకు ఒంటిపూట పాఠశాలలను ప్రకటించింది. 
 
రాష్ట్రంలోని ప్రభుత్వ, జిల్లా పరిషత్, మున్సిపల్, ఎయిడెడ్, ప్రైవేట్ గుర్తింపు పొందిన అన్‌ఎయిడెడ్ పాఠశాలలతో సహా అన్ని మేనేజ్మెంట్ పాఠశాలల్లో సోమవారం నుంచి అంటే మూడో తేదీ నుంచి చివరి పనిదినం వరకు అంటే 30వ తేదీ వరకు ఒంటిపూట బడులు నిర్వహిస్తారు. 
 
ఈ నెల 3వ తేదీ నుంచి 30వ తేదీన వరకు అందుబాటులో ఉన్న ప్రభుత్వ సెలవు దినాలలో ఆరు రోజులపాటు పరిహార తరగతులను నిర్వహించాలని విద్యాశాఖ స్పష్టం చేసింది. పరిహార తరగతులను కూడా హాఫ్‌డే షెడ్యూల్‌ను అనుసరించాల్సి ఉంటుంది. కాగా, రాష్ట్ర వ్యాప్తంగా 3349 కేంద్రాల్లో టెన్త్ పరీక్షలు ఇవాళ్టి నుంచి ప్రారంభం కానున్న విషయం తెల్సిందే.