బుధవారం, 22 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By సెల్వి
Last Updated : శుక్రవారం, 28 అక్టోబరు 2022 (12:01 IST)

కారుణ్య నియామకాలపై జగన్ సర్కారు కీలక నిర్ణయం

ys jagan
ప్రొబేషన్‌ సమయంలో విధి నిర్వహణలో మృతి చెందిన ఏపీ గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల కుటుంబాలకారుణ నియామకాలను కల్పిస్తూ రాష్ట్రం సరైన నిర్ణయం తీసుకుంది. 
 
ఆ కుటుంబంలో ఒకరికి ఉద్యోగం కల్పించే దిశగా అనుమతులు ఇచ్చింది. ఈ మేరకు కారుణ్య నియామకాలకు అనుమతిస్తూ గ్రామ, వార్డు సచివాలయాల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అజయ్‌ జైన్‌ గురువారం ఉత్తర్వులు జారీచేశారు.
 
పలు ఉద్యోగ సంఘాల విజ్ఞప్తి మేరకు ప్రభుత్వం ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు ఆ ఉత్తర్వుల్లో తెలిపారు. గ్రామ, వార్డు సచివాలయాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల ఆధారంగా కారుణ్య నియామకాలను చేపట్టనున్నట్లు పేర్కొన్నారు.