మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By వరుణ్
Last Updated : ఆదివారం, 23 జులై 2023 (09:58 IST)

బ్లేడుతో భర్త మర్మాంగాన్ని కోసేసి రెండో భార్య.. ఎందుకో తెలుసా?

Blade
ఏపీలోని ఎన్టీఆర్ జిల్లా నందిగామలో ఓ దారుణం జరిగింది. కట్టుకున్న భర్త మర్మాంగాన్ని రెండో భార్య బ్లేడుతో కోసిపడేసింది. విడాకులు ఇచ్చిన మొదడి భార్య వీడియోలను ఇన్‌స్టాగ్రామ్‌ రీల్స్‌ చూడటమే ఇందుకు కారణం. తనను పెళ్లి చేసుకుని ఆమె వీడియోలు ఎందుకు చూస్తున్నవాంటూ ఆగ్రహించిన రెండో భార్య ఈ దారుణానికి ఒడిగట్టింది. స్థానికంగా తీవ్ర కలకలం రేపిన ఈ ఘటన నందిగామలోని అయ్యప్ప నగర్‌లో జరిగింది.
 
ఈ వివరాలను పరిశీలిస్తే, ముప్పాళ్ల గ్రామానికి చెందిన కోట ఆనంద్ బాబు తొలుత ఒక మహిళను పెళ్లి చేసుకున్నాడు. ఆ తర్వాత మనస్పర్థల కారణంగా ఇద్దరూ విడిపోయారు. అనంతరం ఐదేళ్ల క్రితం వరమ్మ అనే మహిళను రెండో వివాహం చేసుకున్నాడు. నిన్న రాత్రి ఇంటికి వచ్చిన ఆనంద్ బాబు... తన మొదటి భార్యకు చెందిన ఇన్‌స్టాగ్రామ్ వీడియోలను చూస్తుండటాన్ని వరమ్మ గమనించింది. 
 
ఆమెలో ఆగ్రహం కట్టలు తెంచుకుంది. తనను పెళ్లి చేసుకున్న తర్వాత ఆమె వీడియోలు ఎందుకు చూస్తున్నావని ప్రశ్నించింది. దీంతో ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగింది. ఇద్దరూ ఒకరినొకరు కొట్టుకున్నారు. ఈ క్రమంలో భర్తపై వరమ్మ బ్లేడ్‌తో దాడి చేసింది. భర్త మర్మాంగాలను కోసేసింది. తీవ్ర రక్తస్రావం కావడంతో ఆయనను తొలుత నందిగామ ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లారు. ఆ తర్వాత మెరుగైన వైద్యం కోసం విజయవాడకు తరలించారు.