సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By శ్రీ
Last Modified: బుధవారం, 6 నవంబరు 2019 (20:18 IST)

మరో 30 యేళ్లు జగన్ సీఎంగా వుండాలి: రమణ దీక్షితులు

తిరుమ శ్రీవారి ఆలయంలో అనాదికాలంగా నాలుగు కుటుంబాల అర్చకులు తరిస్తూ వచ్చారని, ఆగమ సలహా మండలి సభ్యులు రమణదీక్షితులు తెలియచేశారు. ముస్లిం, బ్రిటిష్ కాలంలో కూడా ఎన్ని ఆటంకాలు వచ్చినా పూజా కైంకర్యాలను నిరంతరంగా నిర్వహించాం అని, 1987 వంశపార్యపరంగా వస్తూన్న హక్కులను రద్దు చెయ్యడంతో ఎన్నో దేవాలయాలు మూతపడ్డాయి.
 
2007లో రాజశేఖర్ రెడ్డి చట్టాన్ని సవరణ చేస్తూ మార్పులు తీసుకువచ్చి ఆలయాలు పునరుద్దరణకు చర్యలు తీసుకున్నారన్నారు రమణ దీక్షితులు. గత ప్రభుత్వం ఆగమశాస్త్రంలో లేని విధంగా అర్చకులకు రిటైర్మెంట్ అమలు చేసారు. రిటైర్మెంట్ నిబంధనను తొలగిస్తామని జగన్మోహన్ రెడ్డి ఎన్నికల సమయంలో హామి ఇచ్చారు. 
 
అర్చకుల ఎదురుచూపు ఫలించి జగన్ సియం అయ్యారు. సియం హామి మేరకు నాకు ఆగమ సలహా మండలి సభ్యుడిగా నియమిస్తూ, వారం రోజుల్లో ప్రధాన అర్చకుల పదవిని ఇస్తామని హామిని ఇచ్చారు. రాష్ట్రవ్యాప్తంగా అర్చకులకు, వారి కుటుంబ సభ్యులుకు సౌకర్యాలు కల్పిస్తూన్నారు. 
రాష్ట్రవ్యాప్తంగా అర్చకులు ముఖ్యమంత్రిగారికి రుణపడి ఉంటాం అన్నారు. సియం చేసిన మంచి కార్యక్రమాలు కారణంగానే రాష్ట్రం సుభిక్షంగా వుంది.
 
సమృద్ధిగా జలాశయాలు నిండుతున్నాయి. అర్చక కుటుంబాలను కాపాడుతున్న సియం జగన్ మరో 30 సంవత్సరాలు ఆ పదవిలో కొనసాగాలని, తను భగవంతుని పాద సేవ చేస్తానని, 
ప్రధాన అర్చక పదవిని చేపట్టగానే రాష్ట్రవ్యాప్తంగా ఆలయాలలో ప్రత్యేక పూజలు నిర్వహిస్తామని తెలియజేశారు.