బుధవారం, 25 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By సెల్వి
Last Updated : మంగళవారం, 22 సెప్టెంబరు 2020 (14:45 IST)

ప్రణయ్ హత్య గుర్తిందిగా అంటూ బెదిరింపులు.. గుంటూరులో మరో అమృత

మిర్యాలగూడలో అమృత-ప్రణయ్‌ల లవ్ స్టోరీ అందరికీ గుర్తు ఉండే ఉంటుంది, అమృత-ప్రణయ్‌లు కులాంతర వివాహం చేసుకున్నారు. ప్రణయ్ వేరు కులానికి చెందిన వాడు కావడంతో అమృత తండ్రి అల్లుడిని కిరాయి హంతకుల చేత చంపించాడు. ఈ కేసు దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది. తాజాగా అలాంటి కేసు ఒకటి గుంటూరులో వెలుగులోకి వచ్చింది. నగరంలో ఓ వివాహిత కిడ్నాప్ అయింది.
 
విజయవాడకు చెందిన వైశ్య యువతిని గుంటూరుకు చెందిన దళిత యువకుడు ప్రేమ వివాహం చేసుకున్నారు. జూలై నెలలో ఈ కులాంతర వివాహం దిలీప్ - సౌమ్యలు చేసుకున్నారు. అయితే పెళ్ళి చేసుకున్న నాటి నుంచి యువతి -యువకుడికి తీవ్ర స్థాయిలో బెదిరింపులు వస్తున్నట్టు సమాచారం. నల్గొండ ప్రణయ్ విషయం గుర్తు ఉందిగా అంటూ హెచ్చరించారు. 
 
ప్రణయ్ మాదిరిగా హత్య చేస్తామని యువతి తల్లిదండ్రులు బెదిరింపులకు పాల్పడ్డారు. మంగళవారం నాడు దిలీప్ కుటుంబసభ్యులను కొట్టి సౌమ్యను తీసుకెళ్లారు. మిర్యాలగూడలో ప్రణయ్‌ను హత్య చేసినట్టుగానే హత్య చేయిస్తామని తనను బెదిరించారని సౌమ్య కుటుంబ సభ్యులపై దిలీప్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. 
 
సౌమ్య కుటుంబ సభ్యులతో తనకు ప్రాణహాని ఉందని దిలీప్ గుంటూరు ఎస్పీని ఆశ్రయించారు. తనకు రక్షణ కల్పించాలని ఆయన కోరాడు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.