సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By సెల్వి
Last Updated : గురువారం, 3 డిశెంబరు 2020 (12:58 IST)

కరోనా ఓవైపు.. వరుణుడు మరోవైపు.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు

దేశంలో ఓ వైపు కరోనా విజృంభణ కొనసాగుతుంటే.. మరోవైపు వరణుడు భయపెడుతున్నాడు. కొద్దిరోజుల క్రితం నివర్ తుఫాన్ వల్ల ఏపీ, తమిళనాడులో భారీ వర్షాలు కురిసిన సంగతి తెలిసిందే. నివర్ ధాటికి రెండు రాష్ట్రాల్లో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. భారీగా పంట నష్టం ఏర్పడింది. తాజాగా బంగాళాఖాతంలో మరో వాయుగుండం ఏర్పడినట్టు భారత వాతావరణ శాఖ వెల్లడించింది. 
 
తుఫాన్ బురివీ వల్ల ఈ నెల 4వ తేదీ నుండి తమిళనాడు, కేరళ రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టు అధికారులు పేర్కొన్నారు. తుఫాన్ ప్రభావం కారణంగా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉండటంతో రాష్ట్ర ప్రభుత్వాలు తగిన చర్యలు తీసుకోవాలని అధికారులను హెచ్చరించారు. భారీ వర్షాల నేపథ్యంలో ఎన్టీఆర్ఎఫ్ బృందాలకు రాష్ట్రాలకు చేరుకున్నాయి.