శనివారం, 28 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By సెల్వి
Last Updated : శుక్రవారం, 23 ఏప్రియల్ 2021 (13:16 IST)

కర్నూలు జిల్లాలో మరో దిశ తరహా ఘటన.. పెట్రోల్ పోసి నిప్పంటించారు..

కర్నూలు జిల్లాలో మరో దిశ తరహా ఘటన చోటుచేసుకుంది. బాలికపై డీజిల్ పోసి దుండగులు నిప్పంటించారు. బనగానపల్లె యాగంటిపల్లెలో బాలిక అనుమానాస్పద స్థితిలో చనిపోయింది. తెలంగాణలోని నారాయణపేట జిల్లా మరికల్‌ మండలం రాకొండకు చెందిన కొందరు జీఎన్‌ఎస్‌ఎస్‌ ప్రధాన కాల్వ లైనింగ్‌ పనుల కోసం వచ్చారు. బాలిక (టి.అనూష-15) తండ్రి ఉదయం పనులు చేసేందుకు వెళ్లాడు. ఆ పక్కనే ఉన్న తాత్కాలిక షెడ్ల దగ్గర కుమార్తె ఉంది. 
 
సాయంత్రం ఇంటికి వచ్చిన తండ్ర.. షెడ్‌ పక్కన కుమార్తె మంటల్లో కాలిపోయి ఉండటాన్ని గమనించాడు. పోలీసులకు సమాచారం అందించడంతో అక్కడికి చేరుకుని సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం బనగానపల్లెకు తరలించి, తండ్రి ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నారు. 
 
బాలికపై ఎవరైనా లైంగికదాడికి పాల్పడిన అనంతరం డీజల్‌ పోసి నిప్పటించి హత్య చేశారా.. బాలిక ఆత్మహత్య చేసుకుందా అనే వివరాలు పోలీసుల దర్యాప్తులో తేలాల్సి ఉంది. బాలికపై అత్యాచారం జరిగి ఉండొచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. ఆమె తండ్రిని కూడా ప్రశ్నిస్తున్నారు.. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.