శనివారం, 11 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By జెఎస్కే
Last Updated :విజ‌య‌వాడ‌ , మంగళవారం, 26 అక్టోబరు 2021 (23:01 IST)

అనుష్క త్వ‌ర‌లో పెళ్ళి కూతురు... అత‌నితో కాదు! (video)

అందం...అభిన‌యం... దానికి మించిన‌ ఎత్తు... శ‌రీర సౌష్ట‌వం అనుష్క శెట్టి సొంతం. అందుకే కొత్త‌గా వ‌స్తున్న కుర్ర హీరోయిన్ల క‌న్నా అనుష్క‌కు అంత క్రేజ్. ముప్పై తొమ్మిది ఏళ్ళ వ‌చ్చినా, ఆమె అందంలో త‌రుద‌ల లేదు. అందుకే కుర్రకారు ఆమె చిత్రాల‌ను ఆరాధిస్తారు. అయితే, ఆమె పెళ్ళి ప‌రిశ్ర‌మ‌లో ఒక పెద్ద టాపిక్. ఎపుడూ హాట్ నే. త‌ను డార్లింగ్ ప్ర‌భాత్ తో క్లోజ్ గా ఉంటుంద‌ని, వారిద్ద‌రూ మంచి పెయిర్ అని అంద‌రికీ తెలుసు. ఇంకొంత మంది అభిమానులు అయితే, వాల్ళిద్ద‌రూ డేటింగ్ లో ఉన్నార‌ని, త్వ‌ర‌లో పెళ్ళి కూడా చేసుకుంటార‌ని అభిమానులు ఫిక్స అయిపోయారు. 
 
బాహుబలి సిరీస్ లో అనుష్క‌, ప్ర‌భాస్ జంట అంద‌రినీ అల‌రించింది. ఓరోరి వీరా... అంటూ, ఇద్ద‌రూ రొమాన్స్ సాగించారు. ఆ తర్వాత ఆమె చేసిన మరో లేడీ ఓరియెంటెడ్ మూవీ బాగమతి కూడా బాక్స్ ఆఫీస్ వద్ద ఘన‌ విజయం సాధించింది, ఈ సినిమా అనుష్క సినిమాలు బాగా తగ్గించేసింది.  బాగమతి సినిమా తర్వాత చాలా కాలం గ్యాప్ తీసుకొని ఆమె చేసిన నిశ్శబ్దం సినిమా ప్రేక్షకులను తీవ్ర స్థాయి లో నిరాశ పరిచింది. 
 
చాలా మంది అనుష్క, యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ ప్రేమలో ఉన్నారు అని , ప్రస్తుతం వాళ్లిద్దరూ డేటింగ్ లో ఉన్నార‌ని, త్వరలోనే పెళ్లి పీటలు ఎక్కబోతున్నార‌ని తెగ చెపుతుంటారు. కానీ, సినిమా రీల్ వేరు రియ‌ల్ వేరు. ప్ర‌భాస్, అనుష్క ప్రైవేట్ ఫోటోలు కూడా కొన్ని సోషల్ మీడియాలో లీక్ అవ్వడం కూడా వాళ్ళ ఆన్ స్క్రీన్ కెమిస్ట్రీని పెంచ‌డానికే అనుకోవాలి. 
 
ఎందుకంటే, రియ‌ల్ లైఫ్ లో అనుష్క త్వరలోనే దుబాయి చెందిన ఒక్క ప్రముఖ పారిశ్రామిక వేత్తని పెళ్లి చేసుకోబోతోంద‌ట‌. త‌న క‌న్నా మూడేళ్లు చిన్నవాడ‌యిన యువ‌కుడిని అనుష్క పెళ్ళాడ‌బోతోంద‌ట‌. త్వరలోనే అనుష్క పెళ్ళికి సంబంధించిన వార్త అధికారికంగా బయటకి వచ్చే అవకాశం ఉంది.

అనుష్క ప్రస్తుతం టాలీవుడ్ లో ఒక్క సెన్సషనల్ లా దూసుకుపోతున్న నవీన్ పోలిశెట్టి తో ఒక్క సినిమా చెయ్యడానికి ఒప్పుకుంది, ఈ సినిమాని యూవీ క్రియేషన్స్ బ్యానర్ సంయుక్తంగా నిర్మిస్తుంది, ఒక్క భిన్నమైన కథాంశంతో తెరకెక్కబోతున్న ఈ సినిమా త్వరలోనే సెట్స్ పైకి వెళ్లనుంది. అది కాగానే, అనుష్క పెళ్ళి తంతు తెరపైకి వ‌చ్చే అవ‌కాశాలు క‌నిపిస్తున్నాయి.