మంగళవారం, 7 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By జెఎస్కే
Last Modified: విజ‌య‌వాడ‌ , శుక్రవారం, 3 డిశెంబరు 2021 (11:21 IST)

ఆగ్నేయ బంగాళాఖాతంలో మరో వాయు గండం...

విశాఖకు దక్షిణ ఆగ్నేయంగా కేంద్రీకృతం ఆగ్నేయ బంగాళా ఖాతంలో మరో వాయుగుండం ఏర్పడింది. మరి కొన్ని గంటల్లో పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ప్రవేశిస్తూ, తుఫాన్ గా మారనుంది. రేపు ఉత్తర కోస్తా దక్షిణ ఒడిశా వద్ద తుఫాను తీరం తాకే అవకాశం ఉంది. ఈ రోజు, రేపు ఉత్తరాంధ్ర జిల్లాలకు భారీ నుంచి అతి భారీ వర్ష సూచన వెలువడింది.
 

దీనిని అనుసరించి  తూర్పు గోదావరి యానం జిల్లాలోనూ భారీ వర్షాలు పడే సూచనలున్నాయి.
ఈ సాయంత్రం నుంచి గంటకు 90 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉంది.
మత్స్యకారులు రెండు రోజుల పాటు చేపల వేటకు వెళ్లరాదని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. దీనితో ఉన్నతాధికారుల చొరవతో విశాఖకు సహాయక చర్యలకు 50 మంది ఎస్ డి ఆర్ ఎఫ్ సిబ్బంది చేరుకున్నారు.

 
నేవీ, కోస్ట్ గార్డ్,  ఎన్డీఆర్ఎఫ్ బలగాలు అప్రమత్తం చేసారు. ఈ రోజు రేపు విశాఖలో పర్యాటక ప్రదేశాల్లో సందర్శకులకు అనుమతి నిరాకరించారు. బాధితుల కోసం
కలెక్టరేట్లో ప్రత్యేక టోల్ ఫ్రీ నెంబర్ ఏర్పాటు చేశారు.