Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

నేడు ప్రమాద రహిత దినం... వాహనం చిన్నగా నడపాలని విజ్ఞప్తి...

మంగళవారం, 31 జనవరి 2017 (19:41 IST)

Widgets Magazine
road accident

నేడు ఉభయ తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు ప్రమాద రహిత దినోత్సవంగా జనవరి 31 తేదీని ప్రకటించాయి. ఈ మంగళవారం సాధ్యమైనంత మేరకు రోడ్డు ప్రమాదాలు జరగకుండా చూడాలని ఈ దినోత్సవ ముఖ్యోద్దేశం. రోజురోజుకు రోడ్డు ప్రమాదాలు అధికమవుతున్నాయి. రహదారులు రక్తమోడుతున్నాయి. నిత్యం ప్రమాదాల రూపంలో ప్రయాణికులను బలితీసుకుంటున్నాయి. ఇంటి నుంచి బయటకొస్తే మళ్లీ సురక్షితంగా ఇంటికి తిరిగి చేరతామా అనేది సందేహాస్పదమే. 
 
ఆంధ్రప్రదేశ్‌లో సరాసరిన రోజుకు 55 రోడ్డు ప్రమాదాలు చోటు చేసుకుంటుండగా వాటిలో 47 మంది మృత్యువాతపడుతున్నారు. ప్రతి ఏటా వేల మంది మృతి చెందుతుండగా ఆ సంఖ్యకు రెట్టింపు లెక్కల్లో గాయాలపాలవుతున్నారు. ప్రమాదాల నమోదులో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం దేశంలో 4వ స్థానంలో ఉంది. 
 
తెలంగాణాలో ఏడాదికి సరాసరి ఎనిమిది వేల మంది రోడ్డు ప్రమాదాల్లో మరణిస్తున్నారు. 30 వేల మంది క్షతగాత్రులవుతుండగా 20 వేల కేసులు నమోదవుతున్నాయి. మితిమీరిన వేగం, ట్రాఫిక్ రూల్స్‌ను ఉల్లంఘించడం, హెల్మట్‌లు ధరించకపోవడం, సీట్ బెల్టులను పెట్టుకోకపోవడం, లైసెన్స్ లేకుండా వాహనాలను నడపడం, ఆటోలు పరిమితిని మించి ప్రయాణికులను ఎక్కించుకోవడం ఈ ప్రమాదాలకు కారణమవుతున్నాయి. 
 
వాహనాలను నడిపే చోదకులు ముందుగా వేగం వద్దు.. నెమ్మది ముద్దు అనే అంశాన్ని గుర్తుంచుకోవాలి. నిర్లక్ష్యంగా వాహనాలు నడపడం వల్ల జరిగే ప్రమాదాల వల్ల ప్రమాద బాగిన పడిన వారి కుటుంబాలు వీధిన పడతాయని, అట్లే ప్రమాదంలో దురదృష్టం కొద్దీ తమకే ప్రాణాపాయం జరిగితే తమ కుటుంబానికి తీరని శోకాన్ని మిగిల్చినవారవుతారు. ఈ విషయాన్ని గుర్తెరిగి వాహాన చోదకులు తమ వాహనాలను నడపాలి. ప్రమాద రహిత దినమైన ఈ మంగళవారం మంగళప్రదంగా జరగాలనీ, ఎలాంటి ప్రమాదాలు జరగకుండా సీట్ బెల్ట్ లను, హెల్మెట్లను ధరించి, నెమ్మదిగా వాహనం నడపి ప్రమాదాలు జరగని రోజుగా ఉంచేందుకు అందరూ ప్రయత్నించాలి.Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  
Ap And Telangana Organising No Accident Day

Loading comments ...

తెలుగు వార్తలు

news

ఒక్క రోజైనా గడపమన్నాడు.. నో చెప్పడంతో నెట్లో ఫోటోను యాడ్ చేశాడు.. 100 కాల్స్ వచ్చాయ్

భర్త నుంచి విడాకులు తీసుకుంది. ఆమె వైద్యురాలు. రెండో వివాహం చేసుకుందామని తల్లిదండ్రుల ...

news

వైకాపాపై కోపం లేదు.. హోదా సరే.. ప్యాకేజీ అర్థరాత్రి ఎందుకు ప్రకటించారు: పవన్ ప్రశ్న

ప్రత్యేక హోదా ట్వీట్లు చేస్తే సరిపోదని.. ప్యాకేజీపై, హోదాపై అన్నీ తెలుసుకుని మాట్లాడాలని ...

news

చేనేతకు బ్రాండ్ అంబాసిడర్‌గా ఉంటా.. వారానికి ఓసారి చేనేత వస్త్రాలు ధరిస్తా: పవన్

చేనేతకు బ్రాండ్ అంబాసిడర్‌గా ఉంటానని, వారానికి ఓసారి చేనేత వస్త్రాలను ధరిస్తానని జనసేన ...

news

బ్రేకింగ్ న్యూస్.. జల్లికట్టు చట్టంపై స్టే ఇచ్చేందుకు సుప్రీం నో: తమిళ ప్రజలకు మరో విన్

తమిళులు వారం రోజుల పాటు జరిపిన జల్లికట్టు ఆందోళనలపై అత్యున్నత న్యాయస్థానం సీరియస్ ...

Widgets Magazine