శుక్రవారం, 29 మార్చి 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : మంగళవారం, 10 డిశెంబరు 2019 (16:13 IST)

సిగ్గుశరం లేని వంశీ.. దమ్ముంటే రాజీనామా చేయాలి : తెదేపా ఎమ్మెల్యేల ఫైర్

ఇటీవల తెలుగుదేశం పార్టీని వీడిన గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీపై ఆ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు తీవ్రస్థాయిలో మండిపడ్డారు. వంశీకి సిగ్గుశరం లేదంటూ మండిపడ్డారు. పైగా, వంశీకి దమ్ముంటే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలంటూ సవాల్ విసిరారు. 
 
ఏపీ అసెంబ్లీ సమావేశాల్లో టీడీపీ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి స్పందిస్తూ, తెదేపా ఎమ్మెల్యేలు దేశ చరిత్రలో ఏపీ అసెంబ్లీ జరిగిన తీరు విస్మయానికి గురి చేస్తుంది. సభ సాంప్రదాయాలకు విరుద్ధంగా సభ జరుగుతుంది. 
 
కొచ్చిన్ అవర్ జరుగుతున్నప్పుడు సభలో వంశీకి ఎలా అవకాశం ఇస్తారు. సభలో మంత్రులు పచ్చి భూతులు తిడుతున్నారు. సభను అపహాస్యం చేస్తూ స్పీకర్ వ్యవహరిస్తున్నారు.
 
సభలో ప్రతిపక్షానికి మాట్లాడే అవకాశం ఇవ్వడం లేదు. ప్రభుత్వం ఏర్పాటై ఆర్నెల్లు అవుతున్నా ఇంకా గత ప్రభుత్వంపై నిందలు వేస్తున్నారు. ఇచ్చిన మాటని తప్పి సీఎం టీడీపీ ఎమ్మెల్యేలను చేర్చుకోవలని చూస్తున్నారు.

151 మంది ఎమ్మెల్యేలు వచ్చినా ఇంకా టీడీపీ సభ్యులను చేర్చుకోవాలని చూస్తున్నారు. కర్ణాటకలో ఇచ్చిన తీర్పును సమీక్ష చెయ్యమని స్పీకర్‌ని కోరుతున్నట్టు చెప్పుకొచ్చారు. 
 
ఆ తర్వాత మరో ఎమ్మెల్యే చిన్నరాజప్ప మాట్లాడుతూ, వంశీకి సభలో సీటు ఇవ్వమని అడగడానికి  కొచ్చిన్ అవర్‌లో అడగడం ఏంటి వంశీకి కొచ్చిన్ అవర్‌లో సభలో చర్చ జరగకూడదని స్పీకర్ గతంలో చెప్పారు.
 
వంశీ సిగ్గు లేకుండా మాట్లాడుతున్నారు. హైదరాబాద్ ఉన్న భూములు, ఆస్తులు  కాపాడుకోవడానికి టీడీపీ నుంచి వెళ్లారు. ఎన్టీఆర్, చంద్రబాబు, దయతో నువ్వు ఎమ్మెల్యే అయ్యావు. ఎమ్మేల్యేగా ఒడిపోతాననే భయంతో వంశీ రాజీనామా చేయడం లేదు.

దమ్ము ఉంటే వంశీ రాజీనామా చెయ్యాలి. టీడీపీ ఎమ్మేల్యేల ఆస్తులపైన, వ్యాపారాలపైన ప్రభుత్వందాడులు చేస్తున్నది. రాష్ట్రంలో జరుగుతున్న దాడులపై రోజా ఎందుకు నోరు మెదపడం లేదు. గతంలో ప్రతి ఇంటికి వెళ్లి పరామర్శలు చేసిన రోజా ఇప్పుడు నోరు మెదపడం లేదు.
 
రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ విఫలం అవడంపై మాట్లాడాలి అంటే వైసీపీ ఎమ్మెల్యేలు భయపడుతున్నారు అంటూ చిన్నరాజప్ప మండిపడ్డారు.