శనివారం, 28 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : బుధవారం, 3 ఫిబ్రవరి 2021 (17:21 IST)

నామినేషన్లు వేసేవారిపై దొంగ కేసులు పెడుతున్నారు: సోమువీర్రాజు

ఏకగ్రీవాలు సహజంగా జరగాలేకానీ, ప్రభుత్వ ఒత్తిడితో కాదని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోమువీర్రాజు పేర్కొన్నారు. ఆయన బుధవారం మీడియాతో మాట్లాడుతూ.. నామినేషన్లు వేసేవారిపై దొంగ కేసులు పెడుతున్నారన్నారు. కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డికి అన్ని విషయాలు చెప్పామన్నారు. వైసీపీ ప్రభుత్వానికి ఓటమి భయం పట్టుకుందన్నారు. 
 
ఏపీకి నిధులు ఇవ్వలేదని విజయసాయిరెడ్డి అనడం హాస్యాస్పదమని సోము వీర్రాజు పేర్కొన్నారు. బడ్జెట్ అనేది అంశాల ప్రాతిపదికన ఉంటుందన్నారు. ఎన్నికలు వచ్చినప్పుడే చంద్రబాబు ప్రత్యేక హోదా అంటారని విమర్శించారు. ఫిర్యాదుల కోసం బీజేపీ టోల్‌ఫ్రీ నెంబర్‌.. 9650713714ను సోమువీర్రాజు ప్రకటించారు.