గురువారం, 2 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : మంగళవారం, 8 ఫిబ్రవరి 2022 (10:33 IST)

ఆంధ్రప్రదేశ్‌లో బడ్జెట్ సమావేశాలకు ముహూర్తం ఖరారు

ఆంధ్రప్రదశ్ రాష్ట్ర శాసనసభ బడ్జెట్ సమావేశాలకు సిద్ధమవుతుంది. ఇందుకోసం ముహూర్తం ఖరారు చేశారు. మార్చి నెలలో ఈ బడ్జెట్ సమావేశాలను నిర్వహించాలని భావిస్తున్నారు. ఈ సమావేశాలను మార్చి 4 లేదా 7వ తేదీల్లో నిర్వహించాలన్న ఆలోచనలో ప్రభుత్వం ఉన్నట్టు తెలుస్తుంది. ఈ బడ్జెట్ సమావేశాల్లో కొత్త జిల్లాల బిల్లును ప్రవేశపెట్టి ఆమోదించే అవకాశం ఉంది. 
 
ఉగాది పండుగ నుంచి కొత్త జిల్లాల పరిపాలనను ప్రారంభించాలన్న పట్టుదలతో రాష్ట్ర ప్రభుత్వం ఉంది. అయితే, ఉగాదికి కేవలం రెండు నెలల సమయం మాత్రమే ఉండటంతో ఈ లోగానే కొత్త జిల్లాల బిల్లుకు ఆసెంబ్లీ ఆమోదం పొందడంపై ప్రభుత్వం దృష్టి సారించింది. 
 
మరోవైపు, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఈ బడ్జెట్ సమావేశాలకే కాదు ఇకపై అసెంబ్లీలో జరిగే ఏ ఒక్క సమావేశాలకు హాజరుకారు. ఇకపై ముఖ్యమంత్రి హోదాలోనే తాను సభలో అడుగుపెడతానని ఇటీవల చంద్రబాబు భీష్మ ప్రతిజ్ఞ చేసిన విషయం తెల్సిందే.